రష్యన్ వైన్.. భారత్ లో ఇప్పుడు ట్రెండింగ్

2025 జనవరి నుంచి అక్టోబరు వరకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే.. రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.;

Update: 2025-12-26 07:30 GMT

అభిరుచులు మారుతూ ఉంటాయి. కాలానికి అనుగునటంగా మార్చే టేస్టులకు.. ట్రెండ్ కు తగ్గట్లు తమ అలవాట్లను మార్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది. వైన్ సేవించే వారు ఇప్పుడు రష్యన్ వైన్ కోసం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం వైన్ అన్నంతనే యూరోపియన్ దేశాల వైన్ కు ప్రాధాన్యత ఇచ్చే భారత సమాజం ఇప్పుడు రూటు మార్చింది. రష్యన్ వైన్ ను ట్రై చేయటం ఇప్పుడో ట్రెండ్ గా మారినట్లు చెబుతున్నారు.

ఈ మార్పునకు తగ్గట్లే వైన్ దిగుమతుల్లో రష్యా వాటా గణనీయంగా పెరిగినట్లుగా మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు ముఖ్యంగా మెట్రో నగరాల్లోనూ.. హై ఎండ్ రెస్టారెంట్లలోనూ.. లగ్జరీ హోటళ్లలోనూ రష్యన్ వైన్ సర్వ్ చేసే ట్రరెండ్ ఇప్పుడు ఎక్కువైంది. వైన్ కల్చర్ పెరుగుతున్న వేళ.. రష్యన్ వైన్ ఇప్పుడు ట్రెండీగా మారినట్లు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ ఏడాది పది నెలల్లో రష్యన్ వైన్ వినియోగం మీద వచ్చిన గణాంకాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మారిన ట్రెండ్ ఏంతన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

2025 జనవరి నుంచి అక్టోబరు వరకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే.. రష్యన్ వైన్ దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయికి చేరుకున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఫ్రాన్స్.. స్పెయి్.. ఇటలీ దేశాల నుంచి వైన్ దిగుమతులు చేసుకోవటం తెలిసిందే. ఈ ఏడాది అందుకు భిన్నంగా రష్యన్ వైన్ పట్ల ఆసక్తి పెరగటం.. అందుకు తగ్గట్లే డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇంతకాల లేనిది ఇప్పుడే రష్యన్ వైన్ ఇంత ట్రెండింగ్ కు ఎందుకు చేరుకుందన్న ప్రశ్నకు మార్కెట్ వర్గాలు ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తున్నాయి.

కొత్త రుచుల కోసం అన్వేషణ.. కొత్త రుచుల పట్ల ఆసక్తి ఒక కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు ధర విషయంలోనూ ఆకర్షణీయంగా ఉండటం రష్యన్ వైన్ కు సానుకూలాంశాలుగా చెబుతున్నారు. దీనికి తోడు మార్కెటింగ్ అంశాలు కూడా సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాల వైన్ తో భారత మార్కెట్ లో రష్యన్ వైన్ పోటీ పడుతున్నట్లుగా చెబుతున్నారు.

భారత్ లో పెరిగిన రష్యన్ వైన్ ఆసక్తి రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాల్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పాలి. ఇంతకాలం రక్షణ.. ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజీస్ రంగంలోకి విస్తరించటం సానుకూలాంశంగా చెబుతున్నారు. దశాబ్దాలుగా భారత్ కు అంతర్జాతీయంగా అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిగా వ్యవహరించే రష్యా దేశానికి చెందిన వైన్ భారత్ లో పెరిగిన క్రేజ్.. ఈ రెండు దేశాలు కల్చరల్ పరంగా మరింత బలోపేతమైన బంధానికి కారణమవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News