పాక్ కు ఆపరేషన్ సిందూర్ 2.0 భయం.. ఎల్ఓసీ నుంచి బ్రేకింగ్ అప్ డేట్!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిక కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఆ దేశం వణికిపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-26 08:40 GMT

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిక కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఆ దేశం వణికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం సరిహద్దుల వెంబడి ఇరు దేశాలపైనా ఘర్షణ వాతావరణం మొదలైంది. ఈ సమయంలో భారత సైనిక చర్య దాటికి పాక్ విలవిల్లాడింది.. సీజ్ ఫైర్ కోసం రిక్వస్ట్ పంపింది. ఈ క్రమంలో.. తాజాగా పాక్ కు ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పట్టుకుందని ఆ దేశ చర్యలతో తెలుస్తోంది.

అవును... ఆపరేషన్ సిందూర్‌ లో భారతదేశం చేసిన ఖచ్చితమైన దాడులతో పాకిస్థాన్ బెదిరిపోయిన సంగతి తెలిసిందే. పాక్ క్షిపణులు, డ్రోన్లు నేరుగా ఇస్లామాబాద్ ను తాకిన పరిస్థితి. దీంతో.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ లు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారనే ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్.ఓ.సీ)లో పరిణామాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి అంటున్నారు.

నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ) వెంబడి, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని ముందు ప్రాంతాల్లో పాక్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆ ప్రాంతాల్లో విస్తృతంగా కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను మొహరిస్తోందని అంటున్నారు. ఆపరేషన్ సిందూర్ 2.0కి భయపడే.. రావాల్ కోట్, కోట్లీ, భింబర్ లలో పాకిస్థాన్ కొత్త యాంటీ డ్రోన్ పరికరాలను ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఎల్.ఓ.సీ వెంబడి 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్లను మొహరించింది.

ఈ సందర్భంగా ఎల్.ఓ.సీ వెంబడి పాకిస్థాన్ మొహరించిన ఆయుధాలు ఈ విధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి డ్రోన్ లను గుర్తించడం.. సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద, చిన్న డ్రోన్ లను గుర్తించగలిగే స్పైడర్ కౌంటర్ యూఏఎస్ వ్యవస్థలను పాక్ మొహరించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో భుజం నుంచి కాల్చే డ్రోన్ నియంత్రణ తుపాకీ... అఫ్రా యాంటీ యూఏవీ జామింగ్ గన్ ను ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఇది 1.5 కి.మీ వరకూ జీపీఎస్ సిగ్నల్స్ ను జామ్ చేస్తుంది.

మరోవైపు.. టర్కీ, చైనా ల నుంచి సరికొత్త డ్రోన్లు, రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి పాకిస్థాన్ చర్చలు జరుపుతోందని అంటున్నారు. దీనికంతటికీ కారణం.. భారత్ యొక్క దూకుడు సైనిక సన్నాహాలే అని అంటున్నారు. ఇటీవల భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం పశ్చిమ సరిహద్దులో తరచుగా విన్యాసాలు నిర్వహితుండటం పాక్ లో సరికొత్త భయాన్ని.. ఆపరేషన్ సిందూర్ 2.0 ఆందోళనలను కలిగిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News