ఉద్యోగుల‌పై జ‌గ‌న‌న్న బాణం ! ఫ‌లించేనా?

Update: 2022-02-27 04:37 GMT
జీతం త‌గ్గినంత మాత్రాన కోర్టుకు వెళ్తాం అంటే ఎలా? ఓ ప్ర‌భుత్వానికి జీతం పెంచే హ‌క్కు,త‌గ్గించే హ‌క్కు రెండూ ఉంటాయి..అని మొన్న‌టివేళ హైకోర్టు వ్యాఖ్యానించింది.అద్దెభ‌త్యం శ్లాబు త‌గ్గించార‌ని గ‌గ్గోలు పెట్టిన ఉద్యోగులు వేళ‌కు బ‌డికి కానీ కార్యాల‌యానికి కాని  ఎందుకు హాజ‌రు కారు.ఇదే వివాదం ఏళ్ల త‌ర‌బ‌డి న‌డుస్తోంది.

వేళ‌కు బ‌డికి రారు..పాఠాలు చెప్ప‌రు.వేళ‌కు ఆఫీసుకు రారు.. ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేయరు.మ‌రి! ఉద్యోగుల‌తో ప‌నిచేయించ‌డం అంటే చంద్ర‌బాబు మాదిరిగా ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డ‌మేనా! అంటే ఔన‌న్న స‌మాధానమే స‌బ‌బు అనిపిస్తోంది.వేల‌కు వేలు,ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు జీతాలు తీసుకుని ఉద్యోగులు త‌మ భాగోతాల కార‌ణంగా కోట్ల‌కు కోట్లు ప‌డ‌గ‌లు ఎత్తుతున్న  దాఖ‌లాలెన్నో ఉన్నాయి.

అయినా స‌రే జీతాలు స‌రిగా అందుకున్నా స‌రే వేళ‌కు రాని ఉద్యోగులు ఎంద‌రో! ఉన్న‌తాధికారుల మాట విన‌ని దిగువ స్థాయి ఉద్యోగులంతా సంఘాల పేరిట హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ల‌నూ మ‌రియు ప్ర‌భుత్వాల‌నీ బెదిరిస్తూ ఉంటారు.ఇలాంటి వారిపై జ‌గ‌న్ తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యం ఏపీ ఆర్థిక శాఖ‌లో ముఖ్యంగా స‌చివాల‌యంలో త్వ‌ర‌లో అమ‌లు కానుంది.ఈ మేర‌కు జీఓ కూడా ఇష్యూ అయింది.

ఈ ఉత్త‌ర్వు ప్ర‌కారం చూసుకుంటే వేళ‌కు స‌రిగా రాని ఉద్యోగులపై క్ర‌మ శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో భాగంగా వారి వారి వేత‌నాల్లో కోత విధించాల‌ని నిర్ణ‌యించారు.నిర్థిష్ట వేళ‌ల్లో ఆఫీసుకు రాకుండా ఏవో కుంటి సాకులు చెప్పి,ఆఫీసు ప‌ని ప‌ట్ట‌కుండా బ‌య‌ట చ‌క్క‌ర్లు కొట్టి క‌బుర్ల‌తో కాల‌క్షేపం చేసే అధికారుల‌కు జ‌గ‌న్ ఝ‌ల‌క్ ఇచ్చారు.తాజా ఉత్త‌ర్వు అనుస‌రించి ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం ఇటు ఉద్యోగ వ‌ర్గాల్లో అటు సంఘ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది.

వేళ‌కు విధుల‌కు హాజ‌రు కాక‌పోతే అంటే ఉద‌యం ఆఫీసు వేళ‌లు ప్రారంభం అయ్యే లోపే ప‌ది గంట‌ల ప‌ది నిమిషాల లోపే ఉద్యోగులు అంతా కార్యాల‌యాల్లోనే ఉండాలి.మ‌ళ్లీ సాయంత్రం ఐదున్న‌ర వ‌ర‌కూ త‌మ‌కు అప్ప‌గించిన విధులు నిర్వ‌ర్తించే వెళ్లాలి. ఈ రెండు నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఉద్యోగుల‌పై శాఖాప‌ర‌మైన క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు కాబోతున్నాయి.

ముఖ్యంగా వేళ‌కు ఉద్యోగి ఆఫీసుకు రాక‌పోతే ఆ రోజును సెల‌వు కింద ప‌రిగ‌ణించి, జీతంలో కోత విధిస్తారు.అలా అని సెల‌వు క‌దా అని వెళ్లిపోవ‌డానికి వీల్లేదు. ఆఫీసులో ఉద్యోగం చేసే వెళ్లాలి అని కూడా అంటున్నారు జ‌గ‌న్. అదేవిధంగా కార్యాల‌యాల‌పై నిరంత‌ర నిఘా కూడా అవ‌స‌రం అని సీఎం భావిస్తున్నారు.

విధుల‌కు సంబంధించి హాజరు అవుతున్నారా లేదా అన్న‌విష‌య‌మై బ‌యోమెట్రిక్ యంత్రాలు ఉన్నా కూడా ఇవి కూడా మిస్ యూజ్ అవుతున్నాయి.దీంతో ఇక‌పై ఏపీ ఆర్థిక శాఖ‌లో మ‌రింత ప‌టిష్టంగా అధికారులు ప‌నిచేసేలా నిబంధ‌న‌లు అమ‌లు కానున్నాయి.
Tags:    

Similar News