ప్రముఖ లాయర్ తన తో చెప్పిన మాటనే జగన్ చెబుతున్నారా?
ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతి స్థానం లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించటం తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఆయన ఇప్పటికే ఏపీ అసెంబ్లీ లో ప్రస్తావించటమే కాదు.. తీర్మానాన్ని పాస్ చేశారు. ఈ తీర్మానాన్ని మండలి లో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఒక రాష్ట్ర రాజధాని ని ఫలానా చోట మాత్రమే ఏర్పాటు చేయాలన్న విషయం కానీ.. రాజధాని ని వేరే ప్రాంతానికి తరలించాలన్న విషయం లో ప్రభుత్వానికి ఉండే అధికారం ఎలాంటిదన్న విషయం పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి తాజాగా ఒక ప్రముఖ న్యాయవాది కీలకమైన అంశాన్ని చెప్పారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
మాజీ అటార్నీ జనరల్ గా ప్రముఖులు.. ప్రస్తుతం రాజధాని పై కేసులు వాదించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి ఇటీవల సీఎం జగన్ కు ఒక కీలకమైన అంశానికి సంబంధించిన సమాచారాన్ని అందించినట్లు గా చెబుతున్నారు. అసలు రాజధాని పై ఎలాంటి బిల్లు అవసరం లేదని.. ఒక జీవోతో మొత్తం పని పూర్తి చేయొచ్చన్న మాట ఆయన చెప్పినట్లు గా తెలుస్తోంది.
రాజ్యాంగంలో రాజధాని అన్న అంశంపై ఎలాంటి వివరణ లేదని.. ప్రభుత్వాధినేత ఎక్కడ నుంచి పాలిస్తే అదే రాజధాని అవుతుందని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం జగన్ సైతం ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు. రాజధాని అన్న పదమే రాజ్యాంగం లో లేదని.. అలాంటప్పుడు రాజధాని ఫలానా.. ఇక్కడే ఉండాలన్నదేమీ లేదన్న విషయం పై ఆయన ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యం లో రాజధాని మార్పు అంశాన్ని సింఫుల్ గా కానిచ్చేయొచ్చంటుననారు. కాకుంటే.. సీఆర్డీవో ను.. ఏపీ హైకోర్టు ను కర్నూలు మార్చే విషయం లో మాత్రం అసెంబ్లీ.. మండలి లాంటి పద్దతి ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ క్రమం లోనే తనకు అడ్డుగా వచ్చిన మండలి ని రద్దు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెప్పక తప్పదు.