యువత నచ్చిన వారితో కలిసి ఉండొచ్చు .. కోర్టు సంచలన తీర్పు !

Update: 2020-11-03 15:50 GMT
యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ ‌లోని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని తెలిపింది. రెండు  వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న విషయంలో న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఉత్తరప్రదేశ్ ‌లోని షహరాన్‌ పూర్‌ కు చెందిన పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే, వారి కులాలు వేరు కావడంతో, ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులు ఎవరికీ కనిపించకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారు.

ఆ తర్వాత కొన్నిరోజులకి  ఆచూకీ కనిపెట్టిన పూజా కుటుంబ సభ్యులు వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం తాము మేజర్లమని తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు.  భర్తతోనే కలిసి ఉంటానని ఆమె స్పష్టంగా కోర్టుకి తెలియజేసింది. దీనికి  న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు.
Tags:    

Similar News