నివాసం శ్మశానం ....విభూది అలంకారం
ఇలా శివుడి గురించి ఎన్నో గాధలు ఉన్నాయి. అయితే శివుడు ఏమి చేసినా అందులో శివ తత్వం ఉంటుంది. అది తెలుసుకోవాల్సి ఉంటుంది.;
శివుడుకి భక్త సులభుడు అని పేరు. ఆయనకు అభిషేకం చేస్తే చాలు కోరికలు తీరుస్తాడు. అంటే శివ లింగం మీద భక్తిగా నీరు తెచ్చి అర్చిస్తే చాలు అన్న మాట. పురాణ పురుషులలో శివుడు ప్రత్యేకం. ఆయన నివాసం శ్మశానం. ఆయన పులి చర్మం ధరిస్తాడు. మెడలో పాము ఉంటుంది. ఆయనకు ఆభరణాలు ప్రత్యేకంగా ఉండవు. ఆడంబరాలకు దూరం. అంతే కాదు కష్టాలు ఉన్నాయంటే అవి శివుడే భరించాడు. విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. వరాలు రాక్షసులకు ఇచ్చి మరీ వారి భస్మాసుర హస్తం తన మీదకు పెట్టబోతే ఇబ్బంది పడ్డాడు. ఇలా శివుడి గురించి ఎన్నో గాధలు ఉన్నాయి. అయితే శివుడు ఏమి చేసినా అందులో శివ తత్వం ఉంటుంది. అది తెలుసుకోవాల్సి ఉంటుంది.
సమానత్వానికి ప్రతీక :
శ్రీ పురుషులు సమానమే అని ఆధునిక కాలంలో వాదన వినిపిస్తున్నారు. కానీ పురాణ కాలంలోనే తనలోని సగ భాగాన్ని పార్వతికి ఇచ్చిన శివుడి కంటే ఈ విషయంలో గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే అవును అనే చెప్పాలి. అర్ధనారీశ్వరుడుగా అలా శివుడు తన సందేశాన్ని జాతికి అందించాడు శివుడు శక్తి అంటేపార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఇది శివ-శక్తి ఏకత్వాన్ని చూపిస్తుంది. అంతే కాదు శివుడు, పార్వతి ఒకరినొకరు విడిపోలేక ఒక రూపంలో ఉండాలని తలిచాడు. అలా అర్ధనారీశ్వరుడుగా దేవుడు అయ్యాడు. శివుడు పురుష రూపంలో పార్వతి స్త్రీ రూపంలో ఒకే శరీరంలో ఉండడం అరుదైన తత్వం.
శివ తాండవం :
శివుడు సతీదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సతీదేవి దక్షప్రజాపతి కూతురు. కానీ, దక్షప్రజాపతికి శివుడు ఎందుకో నచ్చలేదు. ఒకసారి దక్షప్రజాపతి యజ్ఞం చేస్తే స్వయాన తన అల్లుడైనా శివుడిని పిలవలేదు అలా అగౌరపరుస్తాడు. అయితే సతీదేవి తండ్రి ఇంటికి వెళ్లి ఆ యజ్ఞంలో పాల్గొంది. కానీ అక్కడ దక్షప్రజాపతి శివుడిని అవమానించాడు. సతీదేవి తట్టుకోలేక అక్కడే యాగాగ్నిలో దూకి మరణిస్తుంది.
సతీదేవి మరణం తెలుసుకున్న శివుడు కోపంతో దక్షుడి ఇంటనే ప్రళయ భయంకరమైన శివతాండవం చేస్తాడు. ఆ సమయంలో ఆయన జటాజూటం నుంచి వీరభద్రుడు పుట్టుకుని వచ్చి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ మీదట శివుడు శాంతించి తన భార్య సతీదేవి శరీరాన్ని మోసుకుని తిరుగుతున్న నేపథ్యంలో విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలు చేస్తాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలు దెశమంతా శక్తి పీఠాలు అయ్యాయని పురాణ గాధలలో చెబుతారు.
భక్త సులభుడు :
ఇక భక్తులకు ఎలా వరాలు ఇస్తారో శివుడి లీలలు చూస్తే ఎన్నో అర్ధమవుతాయి. మార్కండేయుడు ఒక భక్తుడు. అతని ఆయువులోనే మృత్యువు ఉందని తెలిసి శివుడు అతనిని రక్షించాడు. అలా మార్కండేయుడు శివుడిని ప్రార్థించి చిరంజీవి అయ్యాడు. అంతే కాదు రవిదాసుడు అనే భక్తుడు అతడు శివుడిని ప్రార్థించి, మోక్షం పొందాడని కధలు చెబుతాయి. కేవలం భక్తులకే కాదు రాక్షసులకు కూడా శివుడు వరాలు ఇచ్చాడు. భస్మాసురుడు ఒక రాక్షసుడు. అతడు శివుడిని తపస్సు చేసి శివుడు ఇచ్చిన వరంతో ఎవరి తలపైనైనా పెట్టినా అతడు భస్మం అవుతాడు. కానీ, భస్మాసురుడు శివుడినే భస్మం చేయాలని చూశాడు. శివుడు విష్ణువు సహాయంతో భస్మాసురుడిని చివరికి చంపాడు.
శివ గంగావతరణం:
గంగాదేవి స్వర్గం నుండి భూమికి రావాలని భగీరథుడు తపస్సు చేశాడు. గంగాదేవి భూమిపై పడితే నేరుగా విరుచుకుపడితే భూమి తట్టుకోలేదు. దాంతో శివుడు గంగాదేవిని తన జటాజూటంలో పట్టి నెమ్మదిగా భూమిపై పడేటట్లుగా చేస్తాడు. అలా ఆయన తన శిరసున గంగమ్మను పెట్టుకుని గంగాధరుడు అయ్యాడు. అంతే కాదు, దేవదానవులు చేసే సాగర మధనంలో హాలాహలంగా విషం వచ్చింది దాంతో దేవతలు దానవులు భయపడ్డారు. విషయం తెలుసుకున్న శివుడు ఆ విషాన్ని తాగి అందరినీ కాచాడు. తాను నీలకంఠుడు అయ్యాడు.
లింగోద్భవం గురించి :
శివుడి మహిమ తెలుసుకోవాలని బ్రహ్మ విష్ణువు ఒకసారి ఆలోచిస్తారు. అప్పుడు, శివుడు లింగ రూపంలో పుట్టాడు. బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ ఆ శివ లింగం అంతం కనుక్కోవాలని ఎంతగానో వెతకారు. కానీ చివరికి కనుక్కోలేకపోయారు. అలా అదీ అంతం లేనిది శివ లింగం అన్నది దేవ దేవతలకే శివుడు తన మహిమల ద్వారా తెలియచేశాడు.
పశుపతిగా శివుడు :
శివుడు పశువులు అన్నింటికీ పతి. అంటే మొత్తం జీవకోటికి అని అర్ధం. అలాగే సమస్త జీవ రాశులను తనలో లయం చేసుకునే లయకారకుడిగా కూడా చెబుతారు. కేవలం మనుషులకే కాదు, జంతువులకు కీటకాలకు కూడా శివుడు మోక్షం ప్రసాదించాడు. అలా సాలీడు, పాము, ఏనుగు భక్తికి నెచ్చు వరాలు ఇచ్చాడు ఆ విధంగా వెలసినదే శ్రీకాళహస్తిగా ఈ రోజు పుణ్య క్షేత్రంగా ఉంది.త్రేతాయుగంలో శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించి శివుడిని ప్రార్థించాడు. దాంతో మెచ్చిన శివుడు శ్రీరాముడికి రామరక్ష స్తోత్రాన్ని ఇచ్చాడని పురాణ గాధలు చెబుతాయి..