ఎమ్మెల్యే వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

Update: 2020-09-26 17:00 GMT
ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతోంది. స.హ. చట్టం కింద దరఖాస్తున్న చేసిన కార్యకర్తలకు దేశంలో భద్రత కరువవుతోంది. రాజకీయ పార్టీల నేతల వేధింపులు ఈ మద్య దేశంలో పెరిగిపోయాయి. కొందరు సహ కార్యకర్తల హత్యలు కూడా ఉత్తర భారతంలో జరిగాయి.

తాజాగా ఎల్ఎల్.బీ స్టూడెంట్ తెలంగాణలో ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్యాయత్నం చేశానని ఆ యువకుడి వాపోయిన వీడియో కలకలం రేపింది.

హైదరాబాద్ బోరబండకు చెందిన భార్గవరామ్ అనే ఎల్.ఎల్.బీ స్టూడెంట్ ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆస్తుల వివరాలను కోరుతూ ఆర్టీఐ కింద పిటీషన్ వేశాడని చెప్తున్నాడు. దీంతో అప్పటి నుంచి తను వేధింపులు మొదలయ్యాయని భార్గవ్ రామ్ వాపోతున్నాడు.

తాజాగా తనపై, తన కుటుంబంపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని సదురు యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం భార్గవ్ రామ్ ఎమ్మెల్యేపై ఆరోపించిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.
Tags:    

Similar News