పిల్లల పై వైసీపీ ఎమ్మెల్యే వాచ్‌మెన్‌ దాడి!

Update: 2023-06-14 13:20 GMT
ప్రకాశం జిల్లా కనిగిరి లో కలకలం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ కార్యాలయం సమీపం లో విద్యార్థులు క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాల్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కార్యాలయ కిటికీ అద్దాల కు తగలడం తో అవి పగిలిపోయాయి. ఈ నేపథ్యంలో కార్యాలయ వాచ్‌మేన్‌ చెన్నకేశవులు పిల్లలను కొట్టాడు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళన కు దిగారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కనిగిరి లోని పామూరు రోడ్డు లో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కార్యాలయం సమీపం లో ఉన్న ఖాళీస్థలం లో కొంతమంది చిన్నారులు ప్రతి రోజూ క్రికెట్‌ ఆడుతుంటారు. ఈ క్రమంలో బంతి కార్యాలయం లోకి వెళ్లింది. దానిని తీసుకునేందు కు చిన్నారులు లోపలి కి అందులోకి వెళ్లారు. అది చూసిన వాచ్‌మన్‌ చిన్న పిల్లల ను బూతులు తిడుతూ కొట్టాడు. దీంతో ఏడుస్తూ వెళ్లిన చిన్నారులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు రియాజ్, ఫిరోజ్‌ వాచ్‌మన్‌ వద్దకు వచ్చి ఎందుకు పిల్లల ను కొట్టావని అతడి ని నిలదీశారు.

దీంతో వాచ్‌మన్‌ వారి పై కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. మద్యం మత్తులో రెచ్చిపోయిన వాచ్‌మన్‌ అక్కడ ఉన్న అద్దంతో రియాజ్‌ పై దాడి చేయబోగా అతని సోదరుడు ఫిరోజ్‌ పక్కకు లాగారు. అద్దం చివర తగలడం తో రియాజ్‌ చేతి కి స్వల్పంగా గాయమైంది. ఫిరోజ్‌ లాగకుంటే ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

తమ పిల్లలు సమీపం లో క్రికెట్‌ ఆడుకుంటూ ఉంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యే కార్యాలయ వాచ్‌మెన్‌ చెన్నకేశవులు తమ పిల్లల ను కొట్టాడని ఆరోపిస్తున్నారు. తాజాగా మరోసారి తమ పిల్లల పై దాడి చేశాడని మండిపడ్డారు. వాచ్‌మేన్‌ ను ప్రశ్నించేందుకు తాము వస్తే అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. అంతేకాకుండా గాజు పెంకు తో తమను గాయపరిచేందుకు ప్రయత్నించాడని మండిపడ్డారు, దీంతో పిల్లల తల్లిదండ్రులు డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసుల కు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వాచ్‌మేన్‌ ను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏఎస్సై ముల్లా అహ్మద్‌ తెలిపారు. కాగా ఎమ్మెల్యే అండ చూసుకునే వాచ్‌మేన్‌ చిన్న పిల్లల ని చూడకుండా కొట్టాడని పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తీరా తాము వచ్చి అడిగినందుకు తీవ్ర పదజాలంతో దూషించాడని ఆరోపిస్తున్నారు. తాగిన మైకం లో తమను అసభ్యంగా దూషించి గాజు పెంకు తో పొడవడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా తాను ఎమ్మెల్యే మనిషిన ని బెదిరిస్తున్నాడని... వెంటనే అతడిని అరెస్ట్‌ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

చెన్నకేశవులు ఎమ్మెల్యే వాచ్‌మన్‌ కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనక్కి తగ్గారని బాధితులు వాపోయారు. మద్యం సేవించి గొడవపడిన వాచ్‌మన్‌ ను ఎలా వెనకేసుకొస్తారంటూ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే బుర్రా బాధితు లతో మాట్లాడి సర్దిచెప్పారు. వాచ్‌మన్‌ ను మందలించి పోలీసుల కు అప్పగించారు. వాచ్‌మన్‌ కు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపినట్లు పోలీసులు తెలిపారు.


Full View




Similar News