బర్త్ డే స్పెషల్.. కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. బొకే ఇచ్చిన రోజా
పుట్టినరోజులు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ.. అన్ని పుట్టినరోజులు ఒకేలా ఉండవు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపుకున్న 66వ పుట్టిన రోజు వేడుకల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటివరకూ జరిపిన పుట్టిన రోజుల్లో అత్యంత వైభవంగా.. భారీగా నిర్వహించిన బర్త్ డేగా చెప్పాలి. సారుకు ఇష్టమైన ఆరు అంకె రెండుసార్లు వచ్చిన పుట్టిన రోజు కావటంతో ఇంత వేడుక గా పుట్టినరోజు నిర్వహించారన్న వాదన లేకపోలేదు.
తన తండ్రి పుట్టిన రోజుకు వారం ముందు నుంచి బ్యాంగ్ మొదలెట్టిన మంత్రి కేటీఆర్.. తాను అనుకున్నట్లే.. సీఎం సారు పుట్టిన రోజునే డే ఆఫ్ ద ఈవెంట్ గా చేయటంలో సక్సెస్ అయ్యారు. ప్రధాని మోడీ మొదలు పలువురు ముఖ్యమంత్రులు.. ఇతర ప్రముఖులు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అభినందనల వర్షం కురిపించారు. సారుకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటోళ్లు అయితే.. బర్త్ డే సందర్భంగా ఏకంగా పదివేల మందికి భోజనాలు పెట్టించేశారు.
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కార్యక్రమాలు. సారు డ్రీం అయిన హరితహారంలో భాగంగా ఫిబ్రవరి రెండో వారంలో.. అందునా ఎండలు ముదిరే వేళలో లక్షలాది మొక్కలు పోటీ పడి మరీ నాటారు. ఆర్భాటంగా నాటటమైతే నాటారు కానీ.. వాటి అలనా పాలనా ఎవరూ చూస్తారో తెలీని పరిస్థితి. మొత్తానికి పుట్టినరోజు హడావుడి ఎంత చేయాలో అంత చేశారు. ఈ సందడిలోనూ కొందరు వీఐపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లగలిగారు. అలాంటివారిలో ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు.
సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఈ ఫైర్ బ్రాండ్.. సారు చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పూల బొకేను అందించారు. ఈ సందర్భం గా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత.. ఆమె ఫోటోలు దిగారు. ఈ ఫోటోల్లో కేసీఆర్ మనమడు.. కేటీఆర్ కుమారుడైన హిమాన్షు ఉన్నారు. ఫైర్ బ్రాండ్ రోజా కు అతగాడు పెద్ద ఫ్యాన్ అని చెబుతున్నారు. తన తాతకు పిచ్చ ఫ్యాన్ అయిన రోజాతో.. ఆమె అభిమాని అయిన హిమాన్షు.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో రోటీన్ కు కాస్తంత భిన్నంగా ఉందని చెప్పక తప్పదు.