మంగళి వాళ్లను కూడా వదలని వైసీపీ ఎమ్మెల్యే.. డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్?
కక్కుర్తిలో కమండలం అంటే ఇదే కాబోలు. ఇప్పుడా ఆ నియోజకవర్గంలో అందరూ ఇదే సెటైర్లు వేస్తున్నారట.. పోయి పోయి కటింగులు, గడ్డాలు చేసే ఆ బార్బర్ షాపుల వాళ్లను కూడా అధికార పార్టీ నేతలు అడుక్కోవడం ఏంటని దెప్పిపొడుస్తున్నారట.. ఆ నియోజకవర్గంలో ఎవ్వరిని వదలకుండా నాకేస్తున్న ఓ ఎమ్మెల్యే అనుచరుల తీరు.. దీనివెనుక ఆ ఎమ్మెల్యే ఉన్నాడా? అన్న అనుమానులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేపై పడుతున్న నింద ఏమిటీ? వాళ్ల చేతివాటం ఏంటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే కక్కుర్తికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆడిపోసుకుంటున్నారు. ఎందుకు గెలిపించాం రా నాయనా అని అ నియోజకవర్గంలో తలలు పట్టుకుంటున్నారట.. ఇప్పుడు ఇదే ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట..
ప్రపంచంలోనే కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆర్థికంగా చితికి పోతున్నారు. ఆ ఎమ్మెల్యే అనుచరులు మాత్రం కొన్ని కోట్లు వెనుకేసుకుంటున్నారట.. దీనివెనుక ఎమ్మెల్యేనే ఉండొచ్చన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి... అసలు విషయానికి వస్తే.. ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే డబ్బే ప్రదానం అని వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అని కక్కుర్తి పడుతున్నాడట.. మొన్న శ్రావణ మాసంలో బంగారం షాపులు బతికి బట్టకట్టాలంటే.. షాపులు ఓపెన్ చేయాలంటే కండీషన్ పెట్టాడట.. దుకాణాలు తెరిచి బంగారం అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలంటే వాళ్లను 3-4 కోట్లు అడిగాడట ఆ ఎమ్మెల్యే. ఇదే విషయం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వాళ్లు మేం ఇవ్వం అని మొండికేస్తే షాపులు కూడా తెరుచుకోనీయలేదంట..
అలాగే మరి ఇప్పుడు చేతివృత్తుల వారిని ఆ ఎమ్మెల్యే అనుచరులు టార్గెట్ చేశారట.. చేతివృత్తివారైన మంగళి వృత్తి చేసుకునే వాళ్లని కూడా షాప్స్ కు ఇంత అని అడిగాడట రెక్కాడితే డొక్కాడని వాళ్లు ఎమ్మెల్యే అనుచరుల చేతివాటం చూసి షాక్ అయ్యారట.. మరి ఇది ఎమ్మెల్యేకు తెలుసా? ఆయన పేరు చెప్పి అనుచరులు అడుగుతున్నారా? లేక ఎమ్మెల్యేనే అడిగిస్తున్నారా అన్నది ఆ నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. కానీ వాళ్లు మాత్రం ఆ ఎమ్మెల్యేని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారట..
ఈ సారి ఓట్లు కోసం వచ్చినప్పుడు చూపిస్తాం మా తఢఖా అని.. మరి ఇంత కక్కుర్తి ఎమ్మెల్యే లేడు అని వాళ్లంతా ఆడిపోసుకుంటున్నారట.. బార్బర్ షాప్ వాళ్లను కూడా వదలని తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది ఆ నోటా ఈ నోటా బయటపడింది. దీని వెనుక క్లారిటీ రావాల్సి ఉంది.