ర‌చ్చ‌బండ‌ పై వైసీపీ నేత‌ల‌కు ఇంత భ‌యం ఎందుకు...?

Update: 2021-12-27 13:32 GMT
ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని ఎప్పుడు చేప‌డ‌తారు? సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి ఎప్పుడు వ‌స్తారు? ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని చెప్పి కూడా ఏడాది దాటి పోయింది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌నాల్లోకి రాలేదు. మ‌రి ఎప్పుడు వ‌స్తారు? ఈ చ‌ర్చ ఇప్పు డు జ‌నాల్లోకంటే.. కూడా వైసీపీ నేత‌ల మ‌ధ్య ఎక్కువ‌గా సాగుతోంది.

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న ఎప్పుడు వ‌చ్చి.. ప్ర‌జ‌ల‌ను క‌లిసి ఏమ‌డుగుతారో.. ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఏం చెబుతారో.. అనే సందేహం నాయ‌కుల్లో ఉంది. చాలా వ‌ర‌కు జిల్లాల్లో వైసీపీ నాయ‌కత్వం గాడి త‌ప్పింది.

పైన సీఎం జ‌గ‌న్ బాగానే ఉన్నా.. ఆయ‌న అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా.. క్షేత్ర‌ స్థాయిలో నాయ‌కులు మాత్రం ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక పోతున్నారు. ఈ క్ర‌మం లో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే జ‌గ‌న్‌.. ఏం అడుగుతారో.. అని వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితి దాదాపు 8 జిల్లాల్లో క‌నిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ‌, విశాఖ‌, గుంటూరు జిల్లాలు మ‌రింత స‌మ‌స్యాత్మ‌కంగా ఉన్నాయ‌ని.. పార్టీ నేత‌లే చెబుతున్నారు.

నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న‌ప‌థ‌కాలు కూడా ప్ర‌జ‌ల్లోకి వెల్ల‌డం లేదు. నేరుగా వ‌లంటీర్లు తీసుకువెళ్తున్నారే త‌ప్ప‌.. నేత‌లు అస్స‌లు వీటిని ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని మండ‌లాల్లోనూ.. ప‌రిస్థితిని అధ్య‌య‌నం చేసేందుకువీరు..ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఏదో మీడియా ముందుకు వ‌చ్చి.. నాలుగు మాట‌లు అనేసి వ‌దిలేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్‌.. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లుసు కుంటే.. త‌మ బండారం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని వారు హ‌డ‌లి పోతున్నారు. అంతే కాదు.. ప్ర‌జ‌లు క‌నుక త‌మ నాయ‌కులు బాగా ప‌ని చేయ‌డం లేద‌ని.. చెబితే.. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తారో.. లేదో అనే భ‌యం కూడా వీరిని వెంటాడుతోంది. ఈ నేప‌థ్యం లోనే.. ర‌చ్చ‌ బండ కార్య‌క్ర‌మం ఎంత వాయిదా ప‌డితే.. అంత మంచిద‌ని అంటున్నారు.

అయితే.. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యం లో వెనుక‌డుగు వేస్తోంది. అభివృద్ధి మంత్రం ప‌ఠించ‌కుండా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. స‌మ‌స్య‌ల స్వాగ‌తాలే క‌నిపిస్తాయ‌ని.. ప్ర‌భుత్వం కూడా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ర‌చ్చ‌బండ‌ పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అంటున్నారు అధికారులు. మ‌రి ఎన్నాళ్ల‌కు ఇది ప్రారంభిస్తారో చూడాలి.
Tags:    

Similar News