• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లైన మహిళలు ఎక్కువగా...

పెళ్లైన మహిళలు ఎక్కువగా వెతికేది ఇవేనా?

| మొత్తంగా చూస్తే గూగుల్ అనేది వివాహిత మహిళలకు ఒక రహస్య స్నేహితురాలిలా మారిపోయింది.

By - Madhu Reddy
Update: 2026-04-23 14:30 GMT

పెళ్లి తర్వాత ఒక మహిళ జీవితం పూర్తిగా మారిపోతుంది. కొత్త బాధ్యతలు, కొత్త మనుషుల మధ్య తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో బయట ఎవరినీ అడగలేని ఎన్నో సందేహాలకు పరిష్కారం కోసం నేటి గృహిణులు 'గూగుల్ తల్లి'ని ఆశ్రయిస్తున్నారు. భర్త ఇష్టాయిష్టాల నుంచి అత్తమామల మనసు గెలుచుకోవడం వరకు.. వివాహిత మహిళలు గూగుల్‌లో ఎక్కువగా వెతికే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భర్త మనసు గెలవడం ఎలా?:

పెళ్లయ్యాక ప్రతి భార్య కోరుకునేది భర్త ప్రేమను, గుర్తింపును. అందుకే చాలామంది మహిళలు "భర్తను ఎలా ఇంప్రెస్ చేయాలి?", "ఆయనకు నచ్చే వంటకాలు ఏవి?" వంటి విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. భర్త ఎప్పుడూ ఫోన్‌తో లేదా పనితో బిజీగా ఉంటే, ఆయనను ఎలా దారికి తెచ్చుకోవాలి? తమతో ఎక్కువ సమయం గడిపేలా ఎలా చేయాలి? అన్న చిట్కాల కోసం వెతుకుతుంటారు. ఇక ఇది ఆధిపత్యం కోసం కాదు, తమ వైవాహిక జీవితం మరింత మధురంగా ఉండాలనే తాపత్రయంతో చేసే శోధన మాత్రమే.

అత్తమామలతో సత్సంబంధాలు - మాతృత్వం:

భారతీయ కుటుంబాల్లో అత్తమామలతో కలిసిపోవడం ఒక సవాలుతో కూడిన పని. అందుకే కొత్త కోడళ్లు గూగుల్‌ను ఒక మెంటార్‌లా భావిస్తూ "అత్తగారిని ఎలా మెప్పించాలి?", "ఉమ్మడి కుటుంబంలో అందరితో ఎలా కలిసి ఉండాలి?" అనే సూత్రాలను వెతుకుతున్నారు. వీటితో పాటు మాతృత్వానికి సంబంధించిన అంశాలు సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. ఇక గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పెంపకం, ఒకవేళ భర్తకు పిల్లలు వద్దంటే ఆయనను ఎలా ఒప్పించాలి వంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాల కోసం మహిళలు గూగుల్‌ను అడుగుతున్నారు.

అందం.. ఆరోగ్యం.. అదనపు ఆదాయం:

ఎన్ని ఇంటి పనులున్నా, తనను తాను అందంగా ఉంచుకోవాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది. అందుకే పెళ్లి తర్వాత వచ్చే శారీరక మార్పులను ఎలా తగ్గించుకోవాలి, చర్మ సంరక్షణ వంటి చిట్కాల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేటి మహిళలు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. అందుకే "ఇంట్లో ఉండే ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?", "పెళ్లి తర్వాత కెరీర్‌ను ఎలా కొనసాగించాలి?" వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు.

గూగుల్ - ఒక సీక్రెట్ ఫ్రెండ్:

మొత్తంగా చూస్తే గూగుల్ అనేది వివాహిత మహిళలకు ఒక రహస్య స్నేహితురాలిలా మారిపోయింది. బయట ఎవరితోనూ పంచుకోలేని భయాలు, సందేహాలు, చిన్నపాటి అసంతృప్తులకు పరిష్కారం కోసం వారు సెర్చ్ ఇంజిన్‌ను నమ్ముకుంటున్నారు. ఇక అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే, ఇటు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి గూగుల్ ఇచ్చే సమాచారం వారికి ఎంతో తోడ్పడుతోంది. తమ కుటుంబం సంతోషం కోసం వారు పడే తపన అంతా ఈ సెర్చ్ హిస్టరీలోనే కనిపిస్తోంది.

Tags:    
  • marriedlife 
  • womenlife 
  • googletrends 
  • indianwomen 
  • housewives 
  • lifetips 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Copyright @2026

Powered by Blink CMS