ఏపీలో మరో రంగారెడ్డి జిల్లా...అదుర్స్ కదూ !
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో అభివృద్ధికి కేరాఫ్ గా మారిన సంగతి తెలిసిందే. అన్నీ అక్కడికే చేరుకుని అతి పెద్ద ప్రగతి సాగుతోంది. హైదరాబాద్ కి సరిసాటిగా మారుతోంది.;
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో అభివృద్ధికి కేరాఫ్ గా మారిన సంగతి తెలిసిందే. అన్నీ అక్కడికే చేరుకుని అతి పెద్ద ప్రగతి సాగుతోంది. హైదరాబాద్ కి సరిసాటిగా మారుతోంది. ఇపుడు అలాంటిదే మరో రంగారెడ్డి జిల్లా తయారు కాబోతోంది. అయితే అది తెలంగాణా రాష్ట్రంలో కాదు, ఏపీలో అందునా వెనకబడినా ఉత్తరాంధ్రా జిల్లాలో. విశాఖ వంటి మెగా సిటీ ముందు అనకాపల్లి ప్రాంతం గతంలో పెద్దగా వెలిగేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరసబెట్టి పెట్టుబడులు అన్నీ అనకాపల్లి కేంద్రంగా తరలివస్తున్నాయి ఒక్కోటీ వచ్చి కుదురుకోవడంతో అనకాపల్లి ప్రగతి మణిహారంగా మారుతోంది. అంతే కాదు భవిష్యత్తు రంగారెడ్డి జిల్లా అని అంటున్నారు ఈ మాటలు ఎవరో అంటే ఆలోచించాలి కానీ రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే మాట అంటున్నారు. అనకాపల్లి అభివృద్ధికి ఆకాశమే హద్దు అని బాబు గట్టి భరోసా ఇవ్వడంతో ఇక మీదట విశాఖ అనకాపల్లి జంట నగరాలుగా ఎదుగుతాయని అంతా అంటున్నారు.
మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తాం :
అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని బాబు చెప్పుకొచ్చారు పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు 5,400 కోట్ల రూపాయల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని బాబు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండేని కానీ ఇప్పుడు ఆ జిల్లానే అత్యంత సంపద కలిగిన ప్రాంతంగా మారిందని బాబు తెలిపారు అదే విధంగా విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుందని బాబు గట్టిగా చెప్పారు.
అంతర్జాతీయ పెట్టుబడులు :
జాతీయ అంతర్జాతీయ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని బాబు ప్రకటించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నానని అనకాపల్లి రాంబిల్లి వేదికగా బాబు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే గడచిన 22 నెలల్లో 802 ఎంఓయూలు చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ఇక వాటిపై నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. . స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు.
పెట్టుబడుల పండుగ :
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు సహకరిస్తూ భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ప్రతి రోజూ పెట్టుబడుల పండుగ అని ఆయన అభివర్ణించారు. ఇక ఈ నెల 28 తేదీన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని బాబు తెలిపారు. అలాగే జూలైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోందని అన్నారు. అదే విధంగా లారస్ ల్యాబ్ అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వస్తోందని అన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం :
ఇక . ప్రధాని మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నామని బాబు చెప్పారు. అలాగే విశాఖ కేంద్రంగా . రైల్వే జోన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విశాఖ-రాజమహేంద్రవరం మధ్య కార్గో కోసం నాలుగు రైల్వేలైన్ల స్పీడ్ రైల్ కారిడార్ వస్తోందని బాబు వెల్లడించారు. ఇక మీదట ఏపీ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని బాబు భరోసా ఇచ్చారు. అంతే కాదు ఇతర రాష్ట్రాల నుంచే ఇక్కడికి వచ్చి ఉపాధి పొందే పరిస్థితి తెస్తామని అన్నారు. తాజాగా రాంబిల్లిలో ఏర్పాటు అవుతున్న రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌తో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని బాబు చెప్పుకొచ్చారు.