జోరు తగ్గిస్తేనే జోగి గెలుపు... వైసీపీ టాక్ ఇదే..!
రాజకీయాల్లో నేతలకు జోరు ఉండాలి. కానీ.. అది అన్ని వేళలా.. కలిసి వచ్చే అంశం మాత్రం కాదు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు.. జోరు ఉంటే.. అది ఓట్ల రూపంలో సానుకూల ఫలితం ఇస్తుంది. కానీ, ఎన్నికలు పూర్తయి.. గెలిచిన తర్వాత కూడా .. అదే జోరుతో సాగుతామంటే.. ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు. మీరు మాకు ఏం చేశారు? నియోజకవర్గానికి ఏం చేశారు? అని వారు ప్రశ్నిస్తే.. సదరు నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్ననే ఎదుర్కొంటు న్నారు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్.
గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న రమేష్.. దూకుడుగా ఉన్నారు. నోటితో సీరియస్ కామెంట్లు చేయడంతోపాటు.. కండబలంతో ప్రత్యర్థి పార్టీలపైనా.. దూకుడుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోం ది. అయితే.. దీనిని ప్రజలు హర్షించడం లేదు. జోగికి నచ్చినా.. నచ్చకున్నా.. ఇప్పుడు మాత్రం గ్రాఫ్ చాలా దిగిపోయింది. నియోజకవర్గంలో సమస్యలను పట్టించుకోవడం మానేసిన జోగి.. రాష్ట్ర స్థాయి సమస్యలపై స్పందించడం.. టీడీపీ అధినేత ఇంటిపై దూకుడుగా వెళ్లడం.. వంటివాటిని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
దీనికి కారణం.. పెడన రాజకీయాలు.. ఇతర నియోజకవర్గాల రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అంతా కూల్ కూల్ వాతావరణం. అందరూ సామరస్య పూర్వకంగా ఉంటారు. ప్రత్యర్థులను కూడా మిత్రులుగా పరిగణించే సంప్రదాయం ఇక్కడ ఉంది. అయితే.. రమేష్ దూకుడు మాత్రం దీనికి భిన్నంగా ఉండడం.. స్థానిక సమస్యలను వదిలేసి.. అధిష్టానం మెప్పుకోసం.. దూకుడుగా వ్యవహరించడం వంటివి ఆయనపై నెగిటివ్ మార్కులు పడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో నే ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యుడే పరాజయం పాలయ్యారు.
సో.. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికలకు సంకేతాలు కావడం గమనార్హం. అయితే.. జోగి మాత్రం తన దూకుడు ను ఏమాత్రం తగ్గించకపోవడం మరో కీలక విషయం. తనకు మంత్రి పదవి ఖాయమనిఆయన ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని తన అనుచరులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి.. మంత్రి అయితే.. ఏంటి.. మరొకటి అయితే.. ఏంటి.. తమ సమస్యలు పరిష్కరించనప్పుడు..? అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఇది కూడా నిజమే కదా!! అంటున్నారు పరిశీలకులు. సో.. ఇకనైనా.. జోగి దూకుడు తగ్గిస్తేనే బెటర్ అనే సూచనలు వస్తున్నాయి.