వైసీపీ కేడర్ డీలా పడుతోందా?
పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ తో నడిచారు.. నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టారు. కానీ చావుతప్పి గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అయితే అధికార యావ గెలిచిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఊరికే ఉండనివ్వదు కదా.. వారిని వైసీపీ ప్రభుత్వంలోకి జంప్ చేయాలని ఎగదోస్తుంది.
ఆ కోవలోనే చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. కొందరు వ్యాపారాలు కాపాడుకోవడానికి.. మరికొందరు ఆస్తులు నిలుపుకోవడానికి.. ఇంకొందరు రాజకీయ మనుగడ కోసం అధికార వైసీపీ బాట పడుతున్నారు. కానీ పక్కపార్టీల నుంచి వచ్చిన వారితో వైసీపీనే నమ్ముకొని ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది.
పక్క పార్టీ లో నుంచి ఎమ్యెల్యే స్థాయి నేత ఎప్పుడైతే అధికారపార్టీలో వచ్చి చేరతారో ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ కి మరింత మైనస్ లో పడినట్లే అని గతంలో పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేతలు క్యాడర్ డీలా పడిపోతుండటం రివాజు.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వైసీపీని మోస్తే అధిష్టానం తీసుకునే ఈ నిర్ణయాలు అధికారపార్టీని బలహీనపర్చేవే తప్ప బలపర్చేవి కావని ఆయా నియోజకవర్గాల్లో నేతలు వాపోతున్నారు. ఇదే ధోరణి తో జగన్ సర్కార్ ముందుకు వెళ్లేలాగే కనిపిస్తుంది.
మరికొందరు అధికారపార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నారని వైసీపీ నేతలు అంటూ ఉండటంతో ఇంకొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త వివాదాలు తెరపైకి రానుండటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఫిరాయింపుల అంశంలో గతానికి ప్రస్తుతానికి ఒక్కటే కనిపిస్తుంది.
అయితే పార్టీ మారేందుకు వచ్చేవారికి చంద్రబాబు లాగా వైసీపీ అధిష్టానం బంపర్ ఆఫర్ లు ఏమీ ఇవ్వడం లేదు. ప్రలోభాలకు గురిచేయడం లేదు. మంత్రి పదవులు వారికి ఆశ చూపడం లేదు. నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు సంబంధించే గోడదూకే వాతావరణాన్ని వైసిపి కల్పిస్తోంది. ఇది తప్ప మిగిలిన అన్ని అంశాల్లో అంతా టిడిపి బాటనే అధికార వైసీపీ అనుసరిస్తుండటం గమనార్హం.