అవును.. అతడే యాకూబ్ మెమన్

Update: 2015-07-28 19:11 GMT
అన్నీ అనుకన్నట్లు సాగితే.. మరో రెండు రోజుల వ్యవధిలో ముంబయి కాల్పుల కేసులో దోషిగా నిరూపితమై.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్షను అమలు చేస్తారు. ఇందుకు సంబంధించి రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి.. ఉరిశిక్ష అమలుకు ఏర్పాట్లు సాగుతుంటే.. మరోవైపు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఆపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.

తాజాగా మెమన్ ఉరిశిక్ష నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్యుల దృష్టికి ఈ ఉదంతం రావటం.. ఇరువురు న్యాయమూర్తుల నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకోవటంతో.. ఈ అంశంపై నిర్ణయాన్ని విసృత్త ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీంతో.. ఈ అంశంపై బుధవారం ఒక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ మెమన్  ఉరిశిక్ష ఇష్యూకు సంబంధించి సుప్రీం ఎలాంటి నిర్ణయం చెప్పకుంటే.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తారని చెబుతున్నారు.

ఇక.. యాకూబ్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. యాకూబ్ మెమన్ అన్న వెంటనే.. కుర్రాడిలా కనిపిస్తూ.. గడ్డం మీసంతో కోర చూపుతో కనిపించే ఫోటో తరచూ వాడుతుంటారు.

తాజాగా ఆయన జైల్లో ఉండి చదువుకున్న కోర్సులో భాగంగా హాల్ టిక్కెట్టు కోసం యాకూబ్ తన తాజా ఫోటోను యూనివర్సిటీ అధికారులకు పంపారు. యాకూబ్ కు చెందిన ఫోటోను మీడియాకు విడుదల చేశారు. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న ఫోటోకు.. యాకూబ్ మెమన్ తాజాగా విడుదలైన అసలు ఫోటోకు మధ్య అస్సలు సంబంధం లేదని చెబుతున్నారు.

మీద పడిన వయస్సు యూనివర్సిటీ విడుదల చేసిన ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. మీద పడిన వయస్సు కూడా స్పష్టంగా తెలుస్తుందన్నభావన వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలం జైల్లో ఉండటంతో.. మారిన జీవనశైలితో ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఫోటోలో ఆ విషయం ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News