షర్మిలకు పులివెందులలో చెక్ పెడుతున్నదెవరు ?

ఆమె కాంగ్రెస్ లో చేరడమే ఇబ్బందిగా మారింది అని అంటున్నారు.

Update: 2024-05-05 03:51 GMT

షర్మిల తాను వైఎస్ కుమార్తెను, రాజన్న బిడ్డను అసలైన వారసురాలిని అని చెప్పుకుంటూ సభలు పెడుతూంటారు. ఆమె వైఎస్సార్ ముద్దుల కుమార్తె. జగన్ కి ఎన్ని హక్కులు ఉన్నాయో ఆమెకూ ఉన్నాయి. అయితే షర్మిల రాజకీయం సొంత పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు మారింది. ఆమె కాంగ్రెస్ లో చేరడమే ఇబ్బందిగా మారింది అని అంటున్నారు.

వైఎస్సార్ కి ఆయన కుటుంబానికి కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏపీ ప్రజలు మరచిపోలేదు. కడప ప్రజలు ఇంకా మరచిపోలేదు. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ చాలా మంచి పార్టీ అని చెబుతున్నారు. ఆనాడు తన అన్న జగన్ ని పదహారు నెలల పాటు జైలులో పెట్టిన విషయాన్ని ఆమె లైట్ తీసుకుంటున్నారు అని వైసీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.

ఇటీవల ఒక ఆంగ్ల చానల్ కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ తమ కుటుంబానికి చేసిన ఘాతుకాన్ని మరచిపోలేను అని స్ట్రాంగ్ గా చెప్పారు. తనను అక్రమంగా అరెస్ట్ చేయించి సీబీఐ చేత విచారణ జరిపించి పదహారు నెలలు జైలులో పెట్టించిన కాంగ్రెస్ ని ఎలా క్షమిస్తాను అని జగన్ అంటున్నారు.

వైఎస్సార్ పేరు లేకుండా వైఎస్ కుటుంబమే రాజకీయాల్లోకి లేకుండా చేయడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసే చర్యలు చేపట్టిందని జగన్ చెప్పుకొచ్చారు. అటువంటి కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా ఇంప్లీడ్ అయి తన మీద కేసులు పెట్టించిందని అన్నారు. ఆ కాంగ్రెస్ లో తన సోదరి షర్మిల చేరడం తనను ఎంతగానో బాధించింది అని అన్నారు.

Read more!

కుటుంబ బంధాలు కూడా పలుచన అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లెలుని తాను ఎంతగానో మిస్ అవుతున్నాను అని ఆయన ఎమోషన్ అయ్యారు. అదే సమయంలో ఆమె వేరే మార్గంలో వెళ్ళి పెద్ద తప్పు చేసిందని ఆయన ఖండితంగా చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇదంతా జరిగింది అని ఆయన అంటున్నారు.

దానికి షర్మిల ప్రెస్ మీట్ పెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారు. అద్దాన్ని తన అన్నయ్యకు పంపుతున్నాను అని అందులో కూడా చంద్రబాబు ముఖమే కనిపిస్తే ఆయన మానసిక స్థితి మీద ఆందోళన చెందాల్సిందే అని చురకలు అంటించారు. తన అన్నకు ఎవరేమి చేసినా చంద్రబాబే చేయించారు అనిపించడం దారుణం అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని ఆమె అంటూ తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్పించింది సుధాకర్ రెడ్డి అనే లాయర్ తప్ప కాంగ్రెస్ కాదని ఆమె మరోసారి తన వాదన వినిపించారు.

ఆయనకు జగన్ పదవులు కూడా ఇచ్చారు అని అన్నారు. తాను కాంగ్రెస్ లో చేరకముందు ఇదే విషయం అడిగితే సోనియాగాంధీ స్వయంగా మాట్లాడుతూ వైఎస్సార్ అంటే తమకు అపారమైన గౌరవం అని ఆయన పేరు ఎందుకు పెట్టిస్తామని చెప్పారని ఆమె అంటున్నారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిసినప్పుడు కూడా ఆయన జగన్ లాయరే వైఎస్సార్ పేరు పెట్టించారు అని చెప్పారని ఆమె అన్నారు.

ఈ విధంగా తన అన్నను తూర్పారా పట్టేశారు. మొత్తానికి చూస్తే కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్న వేళ జగన్ మీదనే ఆమె మరోసారి విమర్శల దాడి చేస్తూ వివేకా హత్య కేసుని కూడా ప్రస్తావించారు. అవినాష్ కి టికెట్ ఇవ్వడం వల్లనే తాను పోటీ చేస్తున్నాను అని ఆమె అంటున్నారు.

4

అయితే ఆమెకు పులివెందులలో కూడా ఓట్లు రానీయకుండా వైసీపీ భారీ స్కెచ్ గీస్తోంది. అక్కడ వైఎస్సార్ కుటుంబం మొత్తం దిగిపోయింది వారంతా నలభై ఆరు డిగ్రీల మండుటెండలో ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి అయితే వీధులలో ప్రచారం చేస్తూ జగన్ కే ఓటు వేయమని కోరుతున్నారు. ఆమె వెంట ఎంపీ అభ్యర్ధి అవినాష్ సతీమణి కూడా ఉన్నారు. రెండు ఓట్లూ ఫ్యాన్ గుర్తుకే అని వారు పులివెందులలో జనాలకు చెబుతూ తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

ఒక ఓటు అంటే ఎమ్మెల్యే ఓటు అన్నకు పడినా ఎంపీ ఓటు తనకు పడుతుందని ఇంతకాలం ఆశించిన షర్మిలకు తాజాగా పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి జై కొట్టడంతో కొంత ఇబ్బందికరంగా ఉంటోందని అంటున్నారు. కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్నా ఆమెకు డిపాజిట్లు డౌట్ అని వైసీపీ అంటోంది. ఆమె ఓటమి దారుణంగా ఉంటుందని కూడా చెబుతున్న వేళ షర్మిల అయితే వివేకా హత్య కేసుని ఎక్కువగా నమ్ముకున్నారు. అవినాష్ రెడ్డి మీద జగన్ మీద ఆమె విమర్శలు ఎక్కు పెడుతున్నారు. ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News