కాపులకు ముద్రగడ క్రాంతి 'పిలుపు'
కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం కుమార్తె.. ముద్రగడ క్రాంతి పిలుపునిచ్చారు.;
కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం కుమార్తె.. ముద్రగడ క్రాంతి పిలుపునిచ్చారు. వైసీపీ నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దని, వారు చేసే కుట్రల్లో భాగస్వామ్యం కావొద్దని ఆమె సూచించారు. బుధవారం ఉదయం ఈ మేరకు ఆయన కాపులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. కాపులు కానీ, తన తండ్రి పద్మనాభం కానీ గుర్తుకు రాలేదని విమర్శించారు. అధికారంలో ఉంటే.. రెడ్లు మాత్రమే జగన్‌కు కనిపించారని తెలిపారు.
కానీ, అధికారంపోయిన తర్వాత.. జగన్‌కు ఇప్పుడు.. కాపులు, కాపు యువత గుర్తుకు వస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆమె వైఎస్ జగన్ పై సీరియస్ అయ్యారు. ``వైఎస్ జగన్‌కు అధికారంలో ఉంటే రెడ్లు.. అధికారం పోగానే కాపులు గుర్తుకువస్తారు`` అని క్రాంతి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నంత కాలం తన తండ్రి పద్మనాభం జగన్‌కు గుర్తుకురాలేదన్నారు. అంబటి రాంబాబు అంశాన్ని వాడుకుని రాష్ట్రంలో అల్లర్లు చేసేందుకు వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
కాపులు మరోసారి జగన్ ట్రాప్‌లో పడొద్దని ముద్రగడ క్రాంతి పిలుపునిచ్చారు. కాపులను వెనుకేసుకు వస్తూ.. వైసీపీ తరఫున మాట్లాడుతున్న తన తండ్రిని ఆ పార్టీ అధినేత జగన్ బలి పశువును చెయ్యరనే గ్యారెంటీ ఉందా? అని క్రాంతి నిలదీశారు. అంబటి రాంబాబుది వ్యక్తిగత అంశమని.. దీనికి కాపు సామాజిక వర్గానిక సంబంధం లేదన్నారు. అంబటి నోరు పారేసుకుని.. సీఎం చంద్రబాబుపై ఇష్టాను సారంగా మాట్లాడితే.. ఈ విషయంలో కాపులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
రాజకీయంగా వైసీపీ చేస్తున్న కుట్రలో కాపులు భాగస్వామ్యం కావొద్దని క్రాంతి కోరారు. ఇది వైసీపీ ఎదుగు దల కోసం వేసిన భారీ స్కెచ్‌గా ఆమె అభివర్ణించారు. ఈ ట్రాప్‌లో చిక్కుకుని కాపుల ఐక్యతకు భంగం కలిగించవద్దన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న క్రాంతి.. అంబటి రాంబాబు ఎపిసోడ్‌ను చూపించి లబ్ధి పొందాలన్న వైసీపీని మరింత దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. జనసేన అధనేత పవన్ కల్యాణ్ అన్ని విషయాలను గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారని పేర్కొన్నారు.