కొత్త రూట్లోకి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్?

రాజకీయ నాయకులు.. అధికారులు.. కొందరు బడా వ్యాపారవేత్తల్ని మాత్రమే టార్గెట్ చేసినట్లుగా భావించారు.

Update: 2024-05-05 05:15 GMT

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో నాటి అధికార పార్టీ వ్యతిరేకులు.. వారి రాజకీయ ప్రత్యర్థులను గురి పెట్టినట్లుగా గుర్తించిన విచారణ అధికారులు.. ఆ జాబితాలో మీడియా సంస్థల అధినేతలు.. ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన కీలక వ్యక్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లుగా గుర్తించినట్లు ప్రచారం నడుస్తుంది.దీని మీద క్లారిటీ రావలిసి ఉంది .

టాస్క్ ఫోర్సు ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్న ప్రణీత్ రావు అండ్ కో ట్యాప్ చేసిన అన్ని నెంబర్లను రీట్రైవ్ చేయటంతో పాటు వాటి జాబితాను సిద్ధం చేశారు. రాజకీయ నాయకులు.. అధికారులు.. కొందరు బడా వ్యాపారవేత్తల్ని మాత్రమే టార్గెట్ చేసినట్లుగా భావించారు. కానీ.. అందులో మీడియా సంస్థల అధినేతలు.. మీడియా ప్రతినిధులు కూడా ఉన్న విషయాన్ని గుర్తించారు.

సదరు మీడియా సంస్థల అధినేతలు.. మీడియా ప్రతినిధుల్ని ట్యాపింగ్ విచారణ అధికారులు సంప్రదిస్తున్నారు. తమ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన నెంబర్లను గుర్తించినట్లుగా పేర్కొంటూ.. ‘మీ నెంబర్ ను కూడా ట్యాపింగ్ చేశారు. మీరు బాధితులేనని గుర్తించాం. మరి.. మీ వద్ద ట్యాపింగ్ కు సంబంధించిన వివరాలు.. ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ.. ఎవరైనా ట్యాపింగ్ కు సంబంధించిన అంశాల్ని షేర్ చేస్తే.. కేసును మరింత బలోపేతం చేయొచ్చన్న ఆలోచనతో పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభా ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని కీలక అంశాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News