కరోనా బెడద తగ్గిపోవడానికి విశాఖ శారదాపీఠంలో యాగం !
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరిని కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు భారతేదశంలో కూడా తన ప్రతాపం చూపిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఏపీలో కూడా కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఏపీలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బెడద తగ్గిపోవాలని నేడు విశాఖ శారదాపీఠంలో ప్రత్యేక యాగాలు ప్రారంభించారు. కరోనా వైరస్ నిర్మూలన కోసం 11 రోజులపాటు ఈ యాగాలని చేయనున్నారు. శాస్త్ర గ్రంధాల్లో సూచించిన మేరకు యాగం నిర్వహిస్తామని , ప్రజలందరూ హాయిగా ఉండాలని విశాఖ శారదాపీఠం ఆకాంక్ష అని స్వామి స్వాత్మానందేంద్ర తెలిపారు. స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ యాగాలు జరుగుతున్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని , రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంది. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉంది. వీటన్నింటి వల్ల ఈ అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నాం అని , ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది అని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.