'వ‌కీల్ సాబ్'కు నేను వ‌కాల్తా పుచ్చుకోలేదు!

Update: 2021-04-06 13:36 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఈ శుక్ర‌వారం రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా చూసేయాల‌ని ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతుండ‌గా.. వీలైన‌న్ని ఎక్కువ ఆట‌లు ప్ర‌ద‌ర్శించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి కోరుతూ లేఖ‌లు రాశారు.

అయితే.. ఏపీలో వ‌కీల్ సాబ్ బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధం లేద‌నే ప్ర‌చారం సాగుతోంది. దేశంతోపాటు, రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేప‌థ్యంలో అద‌న‌పు షోల‌కు ప్ర‌భుత్వం నో చెప్పబోతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌ను వ‌కీల్ సాబ్ మేక‌ర్స్ సంప్రదించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

దీనిపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణ రోజుల్లో బెనిఫిట్ షోల‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇవ్వ‌డం సాధార‌ణం. కానీ.. క‌రోనా సెకండ్ వేవ్‌ తీవ్ర‌స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో ఒకే రోజు ల‌క్ష కేసులు దాటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం నో చెప్ప‌డానికే ఎక్కువ అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

దీంతో.. ఈ విష‌యంలో లాబీయింగ్ చేయ‌డానికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని వ‌కీల్ సాబ్ నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నేప‌థ్యంలో సుబ్బారెడ్డి స్పందించారు. వ‌కీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమ‌తి ఇచ్చేందుకు తాను ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌నే విష‌యంలో ఎలాంటి వాస్త‌వ‌మూ లేద‌ని తేల్చి చెప్పారు.'సినిమా బెనిఫిట్ షోల విష‌య‌మై ప్ర‌భుత్వంతో మాట్లాడుతాన‌ని నేను ఎవ‌రికీ హామీ ఇవ్వ‌లేదు' అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది.
Tags:    

Similar News