దారుణ సంక్షోభం.. సంస్కరణలు అవసరం: ప్రపంచ బ్యాంకు

Update: 2020-10-08 16:08 GMT
కరోనా వైరస్ ఎంట్రీతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రపంచదేశాలన్నీ కుదేలయ్యాయి. జీడీపీ మైనస్ లలోకి జారిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు ప్రపంచ బ్యాంకు కీలక సూచనలు చేసింది.

ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. కరోనా విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనావేసింది.

దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 9.6 శాతం మేర ప్రతికూలత నమోదు చేయవచ్చని పేర్కొంది. 2022 సంవత్సరంలో పుంజుకొని 5.4శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని అంచనావేసింది. కరోనా మహమ్మారి నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలిగిపోతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు భారత్ లో కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏసియా చీఫ్ ఎకనామిస్ట్ హాన్స్ టిమ్మర్ అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతి సుధీర్ఘ, కఠినమైన లాక్ డౌన్ భారత్ లో విధించారని.. అందుకే వృద్ధి రేటు ఏకంగా -23.9శాతం దిగజారిన సంగతి తెలిసిందే.

భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి వేగవంతమైన , సమగ్రమైన చర్యలు తీసుకోవాలని.. అప్పుడే భారత్ లో పేదరికాన్ని తగ్గించడానికి ఇన్నాళ్లు కష్టపడి నిలబెట్టుకున్న వృద్ధిని తిరిగి అందుకోవడానికి సాధ్యం అవుతుందని పేర్కొంది.
Tags:    

Similar News