ఇది రేప్ కంటే ఘోరం !

Update: 2015-10-13 22:30 GMT
మూఢ నమ్మకాలు ఎంత భయంకరంగా.. హింసాత్మకమో తిలియజేసే ఘటన ఇది. ఆఫ్రికా దేశాల్లో అమలయ్యే అనాగరికమైన ఈ కల్చర్ గురించి తెలిస్తే.. ఆడపిల్లగా పుట్టటం ఎంత శాపం అనిపించక మానదు. ఎందుకంటే.. వయసులోకి వచ్చున్న అమ్మాయిలు.. అక్కడి ప్రజలు అనుసరించే విధానాలు అత్యంత అనాగరికంగా ఉండటం గమనార్హం.

ఆడపిల్లలు అన్నాక ఒక విషయం వచ్చిన తర్వాత ఛాతీ పెరగటం సహజ పరిణామం. కానీ.. ఆఫ్రికా లోని కేమరూన్.. నైజీరియా.. సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన ఆడ పిల్లలు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ నరకం అంటే ఏమిటో చవి చూస్తారట. ఛాతీ పెరగకుండా ఉండేందుకు అత్యంత కర్కశమైన పద్ధతుల్ని అనుసరిస్తుంది. ఇంత కష్టమంతా కూడా ఛాతీ పెరగకుండా ఉండటానికి వారి తల్లులే చేస్తుంటారు.

ఛాతీ పెరిగితే.. మగాళ్ల చూపులు పడతాయని.. దాని వల్ల మరిన్ని  కష్టాలు ఎదురవుతాయన్న ముందుజాగ్రత్తతో ఆడపిల్లల ఛాతీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్రెస్ట్ ఐరనింగ్ ద్వారా లైంగిక వేధింపులు.. అత్యాచారాల నుంచి రక్షణ కల్పిస్తారన్న విషయం తాజాగా బయటకొచ్చింది. ఛాతీ పెరగకుండా చేసేందుకు పెద్ద పెద్ద రాళ్లు.. లేదంటే వెడల్పుగా ఉండే గరిటెలాంటి వస్తువుల్ని  బొగ్గుల మీద కాలుస్తారు. అనంతరం కాలిపోయే వాటిని తీసుకొచ్చి ఛాతీ మీద బలంగా అణుస్తారు. దీంతో.. బ్రెస్ట్ టిష్యులు దెబ్బ తిని.. అవి పెరగకుండా ఉండిపోతాయి.

ఇలాంటి రాక్షస పద్ధతితో 3.8 మిలియన్ల ముంది వరకు నానా హింసకు గురి అయినట్లుగా అంతర్జాతీయ సంస్థ ఒకటి లెక్క వేసింది. ఇక.. డబ్బులున్న ఆడపిల్లలు అయితే మాత్రం.. వెడల్పుగా ఉండే బెల్టుల్ని గట్టిగా చుట్టుకుంటారని చెబుతున్నారు. దీనితో కూడా ఛాతీ పెరగదు. అయితే.. ఇది అనాగరికమైన ప్రక్రియ అని..  దీని నుంచి మహిళల్ని రక్షించాల్సిన అవసరం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇంతటి అనాగరికమైన కల్చర్ ను భరిస్తున్న ఆఫ్రికా దేశాల మహిళలకు చేతులెత్తి నమస్కరించాల్సిందే. వారి వేదనకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కదూ.
Tags:    

Similar News