• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్​ కెప్టెన్​ బాబర్​కు...

పాక్​ కెప్టెన్​ బాబర్​కు షాక్​..! రూ. 45 లక్షలు భరణం ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన యువతి..!

By - Tupaki Desk
Update: 2020-12-25 11:45 GMT
పాక్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ బాబర్​ ఆజమ్​ పై కొంతకాలంగా ఓ యువతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె తాజాగా కోర్టుకెక్కింది. తాను కేసు ఉపసంహరించుకోవాలంటే బాబర్​ రూ. 45 లక్షలు భరణం చెల్లించాలంటూ ఆమె డిమాండ్​ చేసింది. బాబర్​ తనను మోసం చేశాడని.. లైంగికంగా వాడుకున్నాడని హమీజా అనే యువతి కొంతకాలం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాబర్​ తనను గర్భవతిని చేశాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాబర్​ మనుషులు బెదిరించారని కూడా సదరు యువతి గతంలో మీడియాతో చెప్పారు. అయితే ఈ విషయం పాకిస్థాన్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం యువతి కోర్టులో పిటిషన్​ వేయడంతో మరోసారి ఈ ఘటన వెలుగుచూసింది. బాబర్‌ ఆజమ్‌పై కేసును విత్​డ్రా చేసుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ హమీజా ముక్తర్ డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఆమె కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

హమీజా పిటిషన్‌పై గురువారం పాక్ సెషన్స్‌ కోర్టు విచారణ చేపట్టింది. హమీజ్​ బాబర్​పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆమెకు ఒక్కరూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని బాబర్​ తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. గతంలో హమీజా ఏమన్నదంటే.. ‘బాబర్​ నేను స్కూల్​ ఫ్రెండ్స్​. అతడు క్రికెటర్​ కాకముందే నేను ఎంతో ఆర్థికసాయం చేశాను. 2010లో నన్ను పెళ్లిచేసుకుంటానని బాబర్​ మాటిచ్చాడు. నేను అతడితో సహజీవనం చేశాను. గర్భవతిని కూడా అయ్యాను.

కానీ బాబర్​ స్టార్​ క్రికెటర్​ అయ్యాక నన్ను మరిచిపోయినట్టు నటిస్తున్నాడు. నన్ను దూరం పెడతున్నాడు. నాకు పోలీసులు కూడా సాయం చేయడం లేదు. బాబర్​ వైపే మాట్లాడుతున్నారు’ అంటూ గతంలో ఆమె ఆరోపణలు చేశారు.
Tags:    
  • Babar Azam 
  • Pakistan 
  • Women 
  • Case 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS