వైద్య వృత్తికే కలంకం..బ్రతికుండగానే - బట్టలువిప్పి శవంలా మార్చి..!
ఈ ప్రపంచంలో దేవుడుకి తరువాత దండం పెట్టేది ఒక్క డాక్టర్ కి మాత్రమే. ఆ దేవుడు మనకి జన్మనిస్తే ..ఈ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదిస్తారు. అందుకే ఈ ప్రపంచంలో డాక్టర్ కి అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ , అప్పుడప్పుడు కొంతమంది చేసే కొన్ని తప్పుడు పనుల వల్ల డాక్టర్ల వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. కొందరి నిర్లక్ష్యం కారణంగా ...అందరూ డాక్టర్లు అంతే అనే స్థాయికి చేరింది. తాజాగా ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ బతికి ఉండగానే శవంలా స్మశానానికి వెళ్లాల్సి వచ్చింది.
శరీరం మీద నూలు పోగు లేకుండా.. శవాలను ఉంచే కవర్లో ఎలాంటి కదలిక లేకుండా ఉన్న ఆమెను చూసి కూతురు కూడా చనిపోయిందనే నమ్మింది. స్మశానంలో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా - ఆమెకు ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఇది గమనించిన స్మశాన వాటిక యజమాని వెంటనే అత్యక్రియలు నిలిపేసి - ఆమెను తిరిగి హాస్పిటల్ కు పంపించారు. ఈ సంఘటన దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... గ్లాడీస్ రోడ్రిగ్యూజ్ డె డ్యూర్టే అనే మహిళ రక్త పోటుతో కరోనాల్ ఓవైడోలోని ఓ క్లినిక్ లో చేరింది. ఆమె ఎటువంటి కదలికలు లేకుండా ఉండటంతో డాక్టర్ ఆమె చనిపోయిందని చెప్పింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెను శవంగా భావించి శరీరంపై ఉన్న వస్త్రాలను తొలగించి నగ్నంగా.. శవాలను ఉంచే కవర్లో పెట్టారు. ఆ తరువత ఆ సమాచారాన్ని - ఆమె భర్త ఫెర్రియా - కుమార్తె సాండ్రా డౌర్టేలకు సమాచారం అందించారు. శవాన్ని స్మశాన వాటిక కు తరలిస్తున్నామని తెలిపారు. అక్కడ మళ్లీ ఆమెలో కదలికలు చూసి వెంటనే మరో హాస్పిటల్ కి తరలించారు.
తన తల్లి విషయంలో డాక్టర్ నిర్లక్ష్యం గా వ్యవహరించాడని కుమార్తె సాండ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశాడు. అంతేగాక, ఆమె బట్టలు విప్పేసి జంతువులతో ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు. నేరుగా ఆమెను స్మశానవాటికకు పంపేందుకు అనుమతి ఇచ్చాడు అని తెలిపింది.