• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోనియాకు చంద్రబాబు కటౌట్...

సోనియాకు చంద్రబాబు కటౌట్ గుర్తుకు వచ్చి ఉంటుందా?

By - Tupaki Desk
Update: 2019-11-12 07:09 GMT
మహారాష్ట్ర రాజకీయాలు ఎలా సాగుతున్నాయో చూస్తున్నదే. అయితే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మౌనం శివసేన చిరకాల వాంఛ తీరే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పాలి. బీజేపీని దెబ్బ తీయటానికి వచ్చిన అవకాశాన్ని సోనియా ఎందుకు వదిలేశారు? ఏ కారణం ఆమెను ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చేసింది? అన్న విషయంలోకి వెళితే.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించకమానవు.

మహారాష్ట్ర ఎపిసోడ్ లో సోనియా మౌనం వెనుక చంద్రబాబు కారణంగా చెబుతున్నారు. బాబుకు నేరుగా ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయనకు ఎదురైన అనుభవం జాతీయ స్థాయిలో తమకు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా ఆమె తాజా నిర్ణయం ఉండి ఉంటుందంటున్నారు.

గత ఏడాది ఇదే సమయానికి జోరుగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో కలవటం.. సైద్ధాంతిక విబేదాల్ని పక్కన పెట్టి.. పురిటితో వచ్చి శత్రుత్వాన్ని వదిలేసి కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకున్నదాని ఫలితం తెలంగాణలోనే కాదు.. ఆ తర్వాత ఏపీలోనూ ఓటర్లు ఎంతలా తిరస్కరించింది తెలిసిందే.
కేవలం రాజకీయ స్వార్థమే తప్పించి మరింకేమీ తనకు ముఖ్యం కాదన్న రీతిలో వ్యవహరించిన చంద్రబాబును ప్రజలు ఛీకొట్టారు. ఇలాంటి పరిస్థితే తాము కానీ శివసేనతో చేతులు కలిపితే అన్న ఆలోచనే సోనియాను ముందుకు వెళ్లకుండా నిరోధించి ఉంటాయని చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా తమ దారిన తాము పోటీ చేసి ఉంటే.. తెలంగాణలో తమకు ఎక్కువ స్థానాలు వచ్చి ఉండేవన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పటాన్ని మర్చిపోలేం. అదే సమయంలో కాంగ్రెస్ తో దోస్తానాపై ఏపీ ప్రజలు మండిపాటుతో పాటు.. అసలు ఎలా కలుస్తారంటూ బాబు పార్టీని ఛీదరించుకున్న కారణంగానే ఆ పార్టీకి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకున్న సోనియా.. మహారాష్ట్ర ఎపిసోడ్ విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    
  • Sonia Gandhi 
  • Chandra Babu Naidu 
  • Telugu Desam Party 
  • Congress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS