ఆపరేషన్ కశ్మీర్ కు మోడీ ఫిక్స్ అయ్యారా? అసలేం జరగనుంది?
కశ్మీరం వేడెక్కుతోంది. గడిచిన రెండు వారాలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏం జరగనుంది? మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి అసాధారణ నిర్ణయాలు తీసుకునే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పలువురు ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారు ఆపరేషన్ కశ్మీర్ చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు.
అమరనాథ్ యాత్రికులకు రక్షణ కల్పించేందుకు 40 వేల మంది సైనికులు కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలో ఉండే పోలీసులు.. భద్రతా సిబ్బంది.. సైనికులకు వీరు అదనం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తొలుత పది వేలు.. ప్రస్తుతం మరో పాతిక వేల మంది అదనపు సైనికుల్ని యుద్ధ ప్రాతిపదికన కశ్మీర్ కు పంపుతూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో పలు ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. జాతీయ భద్రతా సలహాదారు.. ఇండియన్ జేమ్స్ బాండ్ గా అభివర్ణించే అజిత్ డోవల్ ఇటీవల కశ్మీర్ ను సందర్శించి.. ఢిల్లీకి వెళ్లిన అనంతరం ఎడా పెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అదనపు సైన్యాన్ని ఎందుకు తీసుకెళుతున్నారన్న దానిపై పలు వర్గాలు.. పలు వాదనల్ని వినిపిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం చూస్తే.. ఏమైనా జరగొచ్చని.. అసాధారణ నిర్ణయాలు తీసుకోవటంలో దిట్ట అయిన మోడీ.. తాజాగా తన తీరుతో మరోసారి షాకివ్వనున్నారన్న మాటను పలువురు వ్యక్తం చేస్తుంటే.. రాచపుండులా మారిన కశ్మీరానికి శాశ్విత పరిష్కారం కోసం మోడీ సాహసోపేతమైన చర్య తీసుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.
మోడీ ఏం చేసే అవకాశం ఉందన్న విషయంలో పలు వర్గాల వాదనల్ని పరిగణలోకి తీసుకుంటే..
% దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా.. ప్రత్యకంగా చూసేలా చేస్తున్న ఆర్టికల్ 35ఏ.. 370 అధికరణాల రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నంతనే కశ్మీర్ లోయలో విపరిణామాలు చోటు చేసుకునే వీలున్న నేపథ్యంలో.. వాటిని అడ్డుకునేందుకు వీలుగా సైన్యాన్ని భారీ ఎత్తున మొహరిస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ 2014.. 2019 ఎన్నికల ప్రణాళికను చూపిస్తున్నారు.
% జమ్ముకశ్మీర్ ను మూడు ముక్కలుగా చేసి.. జమ్మును ప్రత్యేక రాష్ట్రంగా.. కశ్మీర్ లోయను.. లద్దాఖ్ ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మర్చొచ్చన్న అంచనాలు ఉంది. అయితే.. ఈ ఊహాగనాల్ని ప్రజలు పట్టించుకోవద్దని గవర్నర్ సత్యపాల్ మాలిక్ కొట్టిపారేయటం గమనార్హం.
% అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించటం మోడీకి మొదట్నించి అలవాటు. తాజాగా వేలాది సైన్యాన్ని కశ్మీర్ వ్యాలీకి పంపటం వెనుక.. ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీతో పాటు కశ్మీర్ లో కూడా ప్రధాని ఎగురవేస్తారన్న మాటను చెబుతున్నారు.
% ఆగస్టు 15న కశ్మీరంలోని ప్రతి గ్రామంలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ భావిస్తోందని.. అందుకు తగ్గట్లే తాజా ఏర్పాట్లు అని చెబుతున్నారు. తీవ్రవాదులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోకుండా ఉండేందుకే ఇంత భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
% ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీరంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన కేంద్రానికి ఉందని.. అందులో భాగంగానే సైన్యాన్ని తీసుకొస్తున్నారన్న మాటను చెబుతున్నారు.
% పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులకు ఓటింగ్ హక్కులు కల్పిస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. కశ్మీర్ లోని ఒక వర్గం దీర్ఘకాలంగా చేస్తున్న ఈ డిమాండ్ కు మోడీ సానుకూలంగా స్పందిస్తారన్న మాట ఉంది.
% ఆగస్టు 7న ముగిసే పార్లమెంట్ సెషన్ అనంతరం కశ్మీర కు సంబంధించి మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుందని.. దాని అనంతరం చోటు చేసుకునే పరిణామాలకు అధిగమించేందుకు తాజా కసరత్తు అని చెప్పేటోళ్లు లేకపోలేదు.
% ఇదేమీ కాదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగమని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న అర్థం వచ్చేలా ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు తగ్గట్లే.. ఆ దిశగా ఏదైనా సంచలన నిర్ణయాన్ని తీసుకోనున్నారా? అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తుందని చెప్పక తప్పదు.