నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థిగా జానారెడ్డి కొడుకు?
తెలంగాణలో కాంగ్రెస్ ను భర్తీ చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయం మేమే అని దుబ్బాక ఎన్నికల విజయంతో బీజేపీ నిరూపించుకుంది. జీహెచ్ఎంసీలోనూ తొడగొట్టింది. ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్ ను కమలదళం ఎదుర్కోబోతోంది. నిజానికి నాగార్జున సాగర్ లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉంది. తెలంగాణలోనే కాంగ్రెస్ కు నల్గొండ పెట్టని కోట.. ఆ రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగుతారు. మరి తెలంగాణపై జెండా ఎగురవేస్తామని కలలు గంటున్న బీజేపీకి చాన్స్ లేదని అంతా భవిస్తున్న వేళ తెరపైకి కొత్త పేరు వచ్చింది. దీంతో బీజేపీ కూడా నాగార్జున సాగర్ లో ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తిగా మారింది.
2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వకుండా ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ నేత జానారెడ్డిపై టీఆర్ఎస్ నేత నోముల నర్సింహాయ్య గెలిచారు. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. నాగార్జునసాగర్ లో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం రంగంలోకి దిగిందట.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలిద్దరూ బలమైన వారు కావడంతో.. దీంతో అదే రెడ్డిసామాజికవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపుతోందట... ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి అయిన జానారెడ్డి కొడుకునే దించబోతోందన్నది టాక్.
బీజేపీ నుంచి అనూహ్యంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం బలం పుంజుకున్న బీజేపీ ఇక్కడ బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న, ఆర్తికంగా మంచి స్థితిమంతుడు, జానారెడ్డి కుమారుడైన రఘువీర్ ను అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తోంది. రఘువీర్ రెడ్డి బీజేపీ తరుఫున నిలబెట్టేందుకు సంప్రదింపులు సాగిస్తున్నట్టు తెలిసింది.. కాంగ్రెస్ ఓట్లను చీల్చి గెలవాలని ప్లాన్ చేస్తోంది.
అయితే తండ్రి కాంగ్రెస్ వాది కావడంతో కొడుకు బీజేపీలోకి వెళ్లి పోటీచేయడానికి జానారెడ్డి ఒప్పుకునే అవకాశాలు లేవు. తండ్రిని విభేదించి బయటకు వస్తేనే రఘువీర్ రెడ్డికి బీజేపీ టికెట్ దక్కుతుంది. రాజకీయ అవకాశమా.? తండ్రి మాటనా అన్న మీమాంసలో ప్రస్తుతం రఘువీర్ రెడ్డి ఉన్నారట.. బీజేపీ ఆఫర్ ను కనుక జానారెడ్డి కొడుకు అందిపుచ్చుకుంటే జానాతోపాటు కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలినట్టే. కాంగ్రెస్ ఓట్లను చీల్చి బీజేపీ గండికొట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి.