ఇదేం డిమాండ్? 90 నిమిషాల్లో 31వేల హెలికాఫ్టర్ టికెట్లు పూర్తి

కేవలం 90 నిమిషాల వ్యవధిలో వంద కాదు వెయ్యి కాదు ఏకంగా 31,400 హెలికాఫ్టర్ టికెట్లు ఆన్ లైన్ లో అమ్ముడైన సందర్భం తాజాగా నమోదైంది.;

Update: 2026-04-26 18:35 GMT

కేవలం 90 నిమిషాల వ్యవధిలో వంద కాదు వెయ్యి కాదు ఏకంగా 31,400 హెలికాఫ్టర్ టికెట్లు ఆన్ లైన్ లో అమ్ముడైన సందర్భం తాజాగా నమోదైంది. హిమాలయ పర్వతశ్రేణుల్లోని కేదార్ నాథ్ కు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ షటిల్ సర్వీసులకు తీవ్రమైన డిమాండ్ నెలకొంది. కేదార్ నాథ్ చేరుకోవటానికి కాలిబాటతో పాటు హెలికాఫ్టర్ సర్వీస్ కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

వీలైనంత త్వరగా వెనక్కి వెళ్లేందుకు వీలుగా హెలికాఫ్టర్ షటిల్ సర్వీసులు ఉండటంతో.. భక్తులు పెద్ద ఎత్తున ఈ సర్వీసును వినియోగించుకోవటంపై మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 15 మధ్యలో హెలికాఫ్టర్ ద్వారా కేదార్ నాథ్ చేరుకోవటానికి పెద్ద ఎత్తున టికెట్లను ఆన్ లైన్ లో బుకింగ్ లో ఉంచారు. అత్యధికంగా బుకింగ్ లు జరిగిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ.. తెలంగాణ.. కర్ణాటక.. గుజరాత్ రాష్ట్రాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మామూలుగా అయితే బేస్ క్యాంప్ నుంచి కేదార్ నాథ్ ఆలయానికి చేరుకోవటానికి పదహారు కి.మీ. కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉంది. ఇందుకు తీవ్రమైన శారీరక కష్టం ఎదురవుతుంది. అందుకే వీలైనంత తేలికగా.. త్వరగా వెళ్లి వచ్చేందుకు హెలికాఫ్టర్ ప్రయాణం అత్యుత్తమం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ సర్వీసు తీసుకోవటానికి పెద్ద ఎత్తున ఆసక్తి భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. బేస్ పాయింట్ నుంచి ఆలయానికి దగ్గర్లో చేరుకోవటానికి రూ.7వేల నుంచి రూ.13 వేల వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. హెలికాఫ్టర్ సేవలు గుప్త కాశీ.. ఫాటా.. సిర్సీ లాంటి ప్రాంతాల నుంచి కూడడా అందుబాటులో ఉన్నాయి. ఆలయాన్ని తెరిచిన నాలుగు రోజుల వ్యవధిలో 1.24 లక్షల మంది ఆలయాన్ని సందర్శించినట్లుగా చెబుతున్నారు. కష్టాల్ని ఓర్చి మరీ కేదార్ నాథ్ ప్రయాణానికి ఇంత భారీ డిమాండ్ నెలకొనడం గమనార్హం.

Tags:    

Similar News