ఎంపీ కాపురంలో చిచ్చుపెట్టిన బీజేపీ-తృణమూల్ లొల్లి

Update: 2020-12-22 15:42 GMT
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. తన భార్య సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరిందని ఆగ్రహించిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ ఏకంగా భార్యకు విడాకులు నోటీసులు పంపడం సంచలనమైంది. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం.

వచ్ఛే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ఎంపీ భార్య ఇలా చేయడం ఆయనకు ఏమాత్రం నచ్ఛలేదట. పార్టీలో పరువు పోయిందట.. భార్యను కంట్రోల్ లో పెట్టుకోలేని బీజేపీ ఎంపీ అంటూ ఎద్దేవా చేశారట.. బిష్ణు పూర్ ఎంపీ అయిన సౌమిత్రాఖాన్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా..

సుజాతా ఖాన్ పనికి అలక వహించి.. ఆమె కారును తీసేసుకోవడమే గాక, ఆమె హౌస్ సెక్యూరిటీని కూడా ఈ ఎంపీ ఉపసంహరించారు. ఈమె కోల్ కతా లో తృణమూల్ లో చేరడంతో వీరి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి.

తాజాగా తన ఇంటిపేరు వాడుకోకూడదని భార్యకు సూచించాడు సౌమిత్రా ఖాన్. అయితే భార్య వాదన మరోలా ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తన భర్త విజయానికి ఎన్నో రిస్కులు తీసుకున్నప్పటికీ తనకు సరైన గుర్తింపు రాలేదని సుజాత ఆరోపించింది. అందుకే సోమవారం తృణమూల్ కాంగ్రెస్ లో చేరానని ఆమె చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News