కోర్టుకు విజయసాయి ఎందుకు రాలేదంటే చెప్పిన సమాధానం ఇదే

Update: 2021-12-24 08:32 GMT
అక్రమాస్తుల కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన విచారణకు రాకపోవటంపై తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన విచారణకు ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంతకాలం పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని.. రావటం కుదరదని చెప్పారని.. ఇప్పుడు శీతాకాల సమావేశాలు ముగిసినా కోర్టు విచారణకు రాకపోవటం ఏమిటని ప్రశ్నించింది.తాజాగా జగతి పబ్లికేషన్స్.. ఇందూటెక్ జోన్ కేసులపై నాంపల్లిలోని కోర్టు కాంప్లెక్స్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసు విచారణకు విజయసాయి రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ. ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు వేసిన ప్రశ్నకు బదులిచ్చిన విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాది.. ఢిల్లీలో పని ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోయినట్లుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు న్యాయవాది స్పందిస్తూ.. అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Tags:    

Similar News