రేవంత్ వైఖరి అంతుబట్టడం లేదే?

Update: 2023-03-09 09:35 GMT
తెలంగాణా పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరి ఎవరికీ అంతుబట్టడంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతు కల్వకుంట్ల కవిత ఇరుక్కుపోతే రేవంత్ నుండి ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా వినబడలేదు. కేసీయార్ ఫ్యామిలీపై ఆరోపణలు, విమర్శలు చేయటమంటే రేవంత్ ఎంతగా రెచ్చిపోతారో కొత్తగా చెప్పక్కర్లేదు.

గతంలో రేవంత్-కవిత మధ్య చాలా విషయాల్లో తీవ్రస్ధాయిలో వాగ్వాదాలయ్యాయి. అలాంటిది ఇపుడు లిక్కర్ స్కామ్ లో కవితను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న విషయంపై రేవంత్ ఎందుకని నోరిప్పటంలేదు ?
 
ఇప్పటికే కేసీయార్ ఫ్యామిలీపై అనేకసార్లు రేవంత్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్లు హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు స్పందించారు కానీ రేవంత్ మాత్రం తనకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటు పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం స్కామ్ లో రేవంత్ దగ్గరి బంధులు కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.  

కవితకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సృజన్ రెడ్డి పేరు కూడా లిక్కర్ స్కామ్ లో వినబడుతోంది. అయితే సృజన్ పాత్ర ఏమిటి ? ఎంతుందనే విషయంపై క్లారిటిలేదు. సృజన్ ఎవరంటే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి దగ్గర బంధువు. జైపాల్ కు దగ్గర బంధువంటే రేవంత్ కు కూడా దగ్గర బంధువే అవుతారు.

ఎలాగంటే జైపాల్-రేవంత్ దగ్గర బందువులు కాబట్టి. అలాగే సృజన్ ఖమ్మం జిల్లా పాలేరు ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డికి అల్లుడవుతారని సమాచారం. ఉపేందర్ కు రేవంత్ తో మంచి సంబంధాలే ఉన్నాయి.
 
అంటే ఎలాగ చూసుకున్నా రేవంత్ దగ్గరిబంధువు కూడా లిక్కర్ స్కామ్ లో పాత్రుందనే విషయమూ బాగా చర్చ జరుగుతోంది. కవితపై తాను ఏమి మాట్లాడినా అది సృజన్ను కూడా రోడ్డుమీదకు లాగుంతుందని రేవంత్ అనుకుంటున్నారట. అందుకనే కేవలం సృజన్ కోసమే కవిత విషయంలో  రేవంత్ ఏమీ స్పందించటం లేదని పార్టీలో టాక్ నడుస్తోంది. మరిది ఎంతవరకు నిజమో రేవంత్ రెడ్డే చెప్పాలి.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News