హొటల్ బిల్లు ఎగ్గొట్టి..... పాక్ పరువు పోయింది !
మధ్యవర్తి పాత్రలోకి తానుగా దూరింది పాకిస్తాన్. అంతర్జాతీయ శాంతి దూత బిరుదుని కొట్టేయాలని తెగ తాపత్రయ పడింది.;
మధ్యవర్తి పాత్రలోకి తానుగా దూరింది పాకిస్తాన్. అంతర్జాతీయ శాంతి దూత బిరుదుని కొట్టేయాలని తెగ తాపత్రయ పడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమే ఈ అవతారం ఎత్తడం ఎబ్బెట్టుగా అనిపించింది. అంతే కాదు పాకిస్థాన్ ఏమిటి ఈ పాత్రలోకి అసలు నప్పడంలేదని అంతర్జాతీయ సమాజం షాక్ తో బిత్తరపోయింది. పశ్చిమాసియాలో శాంతి కోసం ఇరాన్ అమెరికా దేశాల మధ్య చర్చలకు ఇస్లామాబాద్ ని వేదికగా చేస్తూ పాక్ చేసిన హడావుడి మామూలుది కాదు. ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో పాక్ ఈ రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. తన దేశానికి రప్పించుకుని మరీ తాను అంతర్జాతీయంగా టాప్ అనిపించుకోవాలని ఉవ్విళ్ళూరింది.
చర్చలు విఫలం :
అయితే పాక్ ఏమి ఆశించిందో కానీ అది అసలు సాగలేదు. చర్చలు పూర్తిగా విఫలం అయిపోయాయి. ఇరాన్ తో యుద్ధమే అనుకుంటూ అమెరికా మళ్ళీ ఫైర్ అవుతోంది. ఇరాన్ కూడా అమెరికాకు తమ సత్తా చూపుతామని అంటోంది. ఇలా రెండు దేశాలు పూర్వం కంటే ఎక్కువగా సమర గర్జనలు చేయడం పాక్ మధ్యవర్తిత్వం ఎంత నవ్వులాటగా మారిందో తెలియచేసిన తాజా ఉదంతాలు. అయితే విషయం ఇక్కడితో ఆగలేదు పాక్ తాను స్వయంగా కొత్త ఇమేజ్ కోసం ట్రై చేసి దేశ విదేశాలలో కూడా పరువు మరింత దిగజార్చుకుంది. అదేలా అంటే ఏకంగా రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చి మూడు రోజుల పాటు హొటల్ లో పెట్టి వండి వార్చిన దానికి బిల్లులు చెల్లించకుండా పాక్ ఎగ్గొట్టింది అన్న వార్తలే ఇపుడు అంతర్జాతీయంగా ఆ దేశం పరువు తీస్తున్నాయి.
ఆర్ధిక దైన్యమేనా :
గొప్పలు పోయిన పాకిస్థాన్ విదేశీ అతిథుల కోసం ఇస్లామాబాద్ లో హొటెల్ సెరెనాని బుక్ చేసింది. అక్కడకు వచ్చిన వారికి ఆతీధ్యం ఇచ్చి హడావుడి చేసింది. అయితే ఈ ఆతీధ్యం ఇచ్చినపుడు రొటీన్ ఖర్చులు కూడా పాకిస్థాన్ ఆ హొటెల్ కి చెల్లించలేదని తాజా వార్తలు ప్రచారంలో ఉనాయి. కనీసం హొటల్ బిల్లు కూడా కట్టలేబ్ని ఆర్ధిక దుస్థితిలో పాక్ ఉందన్న సత్యం ఇపుడు బయటపడింది అని అంటున్నారు. ఎవరో మెప్పు కోసం గొప్ప కోసం పాక్ పడరాని పాట్లు పడి కూడా పరువు తీసుకోవడానికే తప్ప దేనికీ అవి పనిచేయలేదని కూడా లోకానికి చాటినట్లు అయింది.
పెద్ద ఎత్తున బిల్లు :
ఈ చర్చల పేరుతో రెండు దేశాల నుంచి పెద్ద ఎత్తున అతిధులు వచ్చారని వారికి హొటెల్ ఆతీధ్యం తో బిల్లు తడిసి మోపెడు అయింది అని అంటున్నారు. అయితే ఇంత పెద్ద బిల్లు చూసి పాక్ పాలకులు నోళ్ళు వెళ్ళబెట్టారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పోనీ కనీసం రొటీన్ ఖర్చు అయినా చెల్లించేందుకు సదరు హొటల్ యజమాని రంగంలోకి దిగాల్సి వచ్చింది అని అంటున్నారు. దానికి కూడా చెల్లించలేని స్థితిలో పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉంది అన్నది ఇపుడు అంతర్జాతీయంగా పాక్ కి తలవంపులు తెస్తోంది. ఇంతకీ పాక్ కి ఒరిగిందేమిటి అంటే అవమానమే అని అంటున్నారు.