జోరుగా బీరు...కూల్ కూల్ సమ్మర్
వేసవి తాపం చల్లార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏ ఏటికి ఆ ఏడు ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి.;
వేసవి తాపం చల్లార్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఏ ఏటికి ఆ ఏడు ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయి. దాంతో సమ్మర్ అంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి వేసవిని తట్టుకునేందుకు మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా మందు బాబులు మాత్రం కొత్త రూట్ ని కనిపెట్టారు. వేడిని కూల్ చేసే సత్తా బీర్ కే ఉందని నమ్మిన వారంతా అందులో మునిగితేలుతున్నారు. బీరు కొట్టు గురూ యన కూల్ గురూ అంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు.
చల్లగా దిగుతోంది :
బీరు కొడితే హాయిగా ఉంటోందిట. చల్లగా గొంతులోకి దిగుతోందిట. దాంతో మందు బాబులు మత్తెక్కించే ఇతర బ్రాండ్లను పక్కన పెట్టి మరీ బీరు తీసుకోవడానికే చూస్తున్నారు. దానికే ఓటేస్తున్నారు. ఎండ ధాటికి గొంతు ఎండిపోవడమే కాదు మండిపోతోంది. దానికి సరైన మందు బీరు అని వారు గట్టిగా నమ్ముతున్నారు. దాంతో బీరు స్టాక్ లేకుండా అమ్ముడైపోతోంది. ఎక్కడికక్కడ తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా బీరు సేల్స్ పెరిగిపోయినట్లుగా డేటా చాటి చెబుతోంది. ఏపీలో చూస్తే గత ఏప్రిల్ నాటికి ఈ రోజుకీ మధ్య ఏకంగా 30 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది.
మరింత అధికంగా :
మరో వైపు చూస్తే మే నెలలో ఈ ఎండలు ఇంకా ఎక్కువగా కాస్తాయని అంటున్నారు. దాంతో బీరు అమ్మకాలు ఇంతకు ఇంత పెరుగుతాయని లెక్క వేస్తున్నారు. వేసవి తాపాన్ని దాహాన్ని సైతం ఆపే శక్తి బీరుకే ఉందని మందు బాబులు భావించడమే కాదు బీరుకే మా ఓటు అంటూ ఏకధాటిగా ఈ వైపుకే దాడి చేయడంలో ఎక్కడ లేని అమ్మకాలు బీరు పరం అవుతున్నాయి. దీంతో మిగిలిన బ్రాండ్స్ అన్నీ కూడా బీరు జోరు ముందు దిగడుపు అవుతున్నాయని అంటున్నారు.
బీరు టాప్ గేరు :
రానున్న మూడు నెలలూ బీరు సేల్స్ టాప్ గేరులో ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే మందు తాగడం పెద్దగా అలవాటు లేని వారు సైతం బీరు వైపు మొగ్గు చూపిస్తున్నారుట. సాఫ్ట్ డ్రింక్ గా దీనిని భావిస్తున్నారా లేక కూలింగ్ కోసం ఈ విధంగా ఆలోచిస్తున్నారా అన్నది పక్కన పెడితే బీరుకే మా ఓటు అంటున్నారు. బయట ఎక్కువగా తిరిగే వారు ఎండలలో పనిచేసే వారు లిక్కర్ అంటే పక్కన పెట్టి బీరుకే మొగ్గు చూపించడంతో ఈ సీజన్ పూర్తిగా బీరుకే అంకితం అవుతోంది. ఏప్రిల్ నెలలోనే సంచలన అమ్మకాలు నమోదు చేసుకున్న బీరు రానున్న కాలంలో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంటున్నారు. ఏది ఏమైనా బీరు కే జై సమ్మర్ కి బై బై అంటూ న్యూ ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్న వైనం అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది అని అంటున్నారు.