తండ్రుల పెత్తనం.. తనయులకు తలనొప్పులు.. !
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో కొడుకులు అధికారంలో ఉంటే తండ్రులు పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.;
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో కొడుకులు అధికారంలో ఉంటే తండ్రులు పెత్తనం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వారసులను రంగంలోకి దింపిన నాయకులు ఇప్పుడు అదే వారసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వీటిలో అటు ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది.
ఇదే విషయం టిడిపిలోనూ ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో టిడిపి తరఫున కొంతమంది వారసులు పోటీ చేశారు కొందరు గెలిచారు. అయితే ఇప్పుడు వారి కంటే కూడా వారి తండ్రులు నియోజకవర్గాల్లో బలమైన చక్రం తిప్పుతున్నారు అన్నది ప్రధాన విమర్శ. ఇది పార్టీకి మేలు చేసే విధంగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేయడం తండ్రి తనయులు కూడా పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లడం వంటి అంశాలు ఉంటే చంద్రబాబు కూడా హర్షిస్తారు.
ఉమ్మడిగా పార్టీని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రజల్లో మరింత మెరుగైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఒక నియోజకవర్గంలో అయితే తనయుడు మంత్రి కావడంతో తండ్రి దూకుడు ఎక్కువగా ఉన్న విమర్శలు వస్తున్నాయి. మరో నియోజకవర్గంలో తనయుడు ఎమ్మెల్యే కావడం తండ్రి చక్రం తిప్పడం వంటివి విమర్శలకు దారి తీసాయి. ఇంకో నియోజకవర్గంలో కొడుకు ఎంపీ కావడం తండ్రి వెనకాల ఉండి అన్ని నడిపిస్తుండడం కూడా విమర్శలకు దారి తీసేలా చేసింది.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తే కొడుకులకి ఉన్న అధికారాలను తండ్రులు అనుభవించడంతోపా టు విమర్శలు వచ్చేలాగా చేస్తుండటమే ఇప్పుడు ప్రధాన సమస్య. అలా కాకుండా ఉమ్మడిగా పార్టీ డెవలప్ చేస్తే ఇబ్బంది లేదు. ప్రభుత్వం తరఫున ప్రచారం చేసినా.. ప్రజల్లో బలాన్ని పెంచే దిశగా అడుగులు వేసినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ దిశగా అడుగులు వేయకుండా కేవలం వివాదాలకే పరిమితం అవుతున్నారు. ఇది పార్టీ పై ప్రభావం చూపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంపై పార్టీలోనూ అంతర్గతంగా చర్చ నడుస్తోంది.