వైరల్ పిక్ - తమ్ముడికి అన్న మద్దతు దొరికినట్లే !!

Update: 2019-07-24 09:40 GMT
గత ఐదేళ్లలో ఎన్నోసార్లు పవన్ తన అన్న రుణం గురించి మాట్లాడారు. మొన్న ఎన్నికల ముందు తన అన్న పార్టీని నాశనం చేసిన వారి మీద కక్ష తీర్చుకుంటాను అని అన్నాడు. ఇలా అన్ని వేదికల మీద అన్న గురించి తమ్ముడు మాట్లాడటమే గాని... తమ్ముడి పాలిటిక్స్ గురించి అన్న మాట్లాడలేదు. ఎన్నికలు వచ్చాయి, ముగిశాయి. దారుణ ఓటమి తర్వాత కూడా తమ్ముడి పయనం ఆగలేదు. అయితే వెయ్యి పదాల కంటే ఒక చిత్రం ఎక్కువ మాట్లాడుతుంది అంటారు... తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫొటో చూస్తే నిజమే అని చెప్పాలి.

పీఆర్పీని స్థాపించి... రాజకీయ వ్యూహాల్లో నిలవలేక పార్టీని కాంగ్రెస్ కలిపేసిన చిరంజీవి రాజ్యసభ సభ్యుడై మంత్రి అయ్యారు. అనంతరం సైలెంటుగా తప్పుకున్నారు. కనీసం ప్రాథమిక సభ్యత్వం రెన్యువల్ చేసుకోలేదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉండటం, మళ్లీ తన సినిమా కెరీర్ ను ఫుల్ స్వింగ్ లో పెట్టుకోవంతో చిరంజీవి రాజకీయాలను వదిలేశారు. కానీ కీలకమైన ఎన్నికల సమయంలో పవన్ కు మద్దతుగా ఒక వాక్యం మాట్లాడక పోయినా... తాజా ఫొటోతో.. అన్న మద్దతు తమ్ముడికి పుష్కలంగా ఉందనుకోవాలి. పవన్ తో మాత్రమే కలిసుంటే అది పర్సనల్ మీట్ అనుకోవచ్చు. కానీ జనసేన కీలక నేత కూడా ఆ మీటింగ్ లో ఉండటంతో ఇది పొలిటికల్ మీట్ అనే చెప్పాలి. మరి ఏ అంశాలు చర్చకు వచ్చాయనేది పక్కన పెడితే... అన్నదమ్ములు రాజకీయంగా ఒకటే అని ఈ పిక్ చెబుతోంది. అయితే, దీని ఈ ఫొటోను మరో రకంగా కూడా చూడొచ్చు.

పవన్ పెద్ద దిక్కు చిరంజీవి కాంగ్రెస్ మనిషి అయితే, నాదెండ్ల పెద్ద దిక్కు అయిన తండ్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ మనిషి. మార్గదర్శకులది ఒక బాట... సుపుత్రులది సొంత బాట అనుకోవచ్చు ఈ ఫొటో చూసి !
    

Tags:    

Similar News