న్యూ ఇయర్ కి వెల్ కం చెప్పిన ప్రపంచం.. ఈ వీడియో చూశారా..!
ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్నారు. అర్ధరాత్రి, బాణసంచా కాల్చి, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.;
ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సరాన్ని ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్నారు. అర్ధరాత్రి, బాణసంచా కాల్చి, పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. మరోవైపు నూతన సంవత్సరం వేళ దైవ దర్శనాలకోసం దేవాలయాల వద్దకు భక్తులు పెద్దయెత్తున తరలివచ్చారు. దీని కారణంగా.. దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అవును... నూతన సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలుకుతోంది. ఆనందోత్సాహాల మధ్య వివిధ దేశాలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి.. జరుపుకుంటున్నాయి. తొలుత పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీప దేశాన్ని న్యూ ఇయర్ పలకరించగా.. తర్వాత న్యూజిలాండ్ లో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇండోనేసియా, హాంకాంగ్, దుబాయ్ సహా పలుదేశాల్లో భారీయెత్తున కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి.
అర్ధరాత్రి వేళ ఆకాశం మొత్తం బాణసంచా శబ్దాలు, రంగురంగుల కాంతితో వెలిగిపోయింది. దేశంలోని ప్రతీ గ్రామగ్రామాన్న నూతన సంవత్సర సంబరాలు మిన్నంటాయి. ఇళ్లు, దేవాలయాలు ఆకర్షణీయమైన విద్యుద్దీపాలతో అలంకరించబడ్డాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సమయంలో... దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద లైట్ అండ్ సౌండ్ షో, గ్రాండ్ బాణసంచా ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా.. టూరిస్టులు, స్థానిక్లుల రూపంలో గుమిగూడిన వేలాది మందిని మంత్రముగ్ధులను చేసేలా ఈ అద్భుతమైన లైట్ షో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోడీ ఆకాంక్ష ఇదే!:
ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరంలోకి కొత్త కొత్త ఆశలతో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా... ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతూ.. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో రాశారు!