ఇటు భోగాపురం... పోలవరం...అటు అమరావతి

ఏపీలో కూటమి ప్రభుత్వం భవిష్యత్తు ఆలోచనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. అదే విధంగా ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని పెట్టుకుని మరీ ఏపీలో కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం చూస్తోంది.;

Update: 2026-01-01 04:02 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం భవిష్యత్తు ఆలోచనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి. అదే విధంగా ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని పెట్టుకుని మరీ ఏపీలో కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం చూస్తోంది. దానికి రానున్న రెండేళ్ళను అత్యంత ప్రాముఖ్యమైనవిగా భావిస్తోంది. కూటమి ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వచ్చింది. ఇక అభివృద్ధి ఫలితాలు అన్నీ 2026 నుంచి మొదలవుతాయని కూటమి పెద్దలు భావిస్తున్నారు. గత రెండేళ్ళుగా కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు పడిన శ్రమ అంతా 2026 నుంచి ఆచరణలోకి వస్తుందని జనాలకు సరైన ఫలితాలు అందుతాయని అంటున్నారు.

భోగాపురంతో స్టార్ట్ :

ఇక ఏపీలో అభివృద్ధి ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే శ్రీకారం చుడుతుందని చెబుతున్నారు. 2026 జూన్ లో భోగాపురం నుంచి తొలి విమానం ఎగరనుంది. అంటే కొత్త ఏడాది మొదలైన తరువాత సరిగ్గా ఆరు నెలల తరువాత అన్న మాట. ఒక్కసారి భోగాపురం నుంచి విమానం ఎగిరితే కనుక దాంతో పాటే అభివృద్ధి కూడా అందుకుంటుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. భోగాపురం విమానాశ్రయం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ డెస్టినీగా అభివృద్ధి చేస్తున్నారు. అతి పెద్ద ఎయిర్ పోర్టుగా కూడా ఇది మనుగడలోకి రానుంది.

పోలరం నెక్స్ట్ :

ఇక 2026 లో భోగాపురం పట్టాలు ఎక్కితే 2027లో సరిగ్గా జూన్ నాటికి పోలవరం కూడా పూర్తి అయి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు ఆ దిశగా యాక్షన్ ప్లాన్ అంతా సాగుతోంది అని అంటున్నారు. ఇక పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ 1034 మీటర్లు నిర్మాణం జరిగి 83 శాతం పూర్తి అయింది అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు నేటికి 87 శాతం పూర్తి చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1, 894 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తూ, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని మంత్రి స్పష్టంగా చెబుతున్నారు.

అమరావతికి ముహూర్తం :

ఇక ఇదే వరసలో ఏపీ రాజధాని అమరావతి కూడా 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. ఆర్థిక వనరులకు ఇపుడు ఎలాంటి సమస్య లేదు, కేంద్రం సహకారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి రాజధాని మీద పూర్తి ఫోకస్ పెట్టింది. దాంతో అమరావతి రాజధాని పనులు 2028 డెడ్ లైన్ గా పెట్టుకుని కంప్లీట్ చేసే ప్రాసెస్ అంతా శర వేగంగా సాగుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News