మోడీ బాబు పవన్ జగన్...2026 ఎలా ఉండబోతోంది ?

దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోడీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకున్నారు.;

Update: 2026-01-01 04:02 GMT

దేశ రాజకీయాల్లో అజేయుడిగా ఉన్నారు నరేంద్ర మోడీ. 2014లో ఆయన ప్రధాని అయిన దగ్గర నుంచి విజయాలనే తన అలవాటుగా చేసుకున్నారు. మూడు సార్లు ప్రధానిగా ఆయన ఇప్పటికి ఉన్నారు. నాలుగవ సారి ఆయనే ప్రధాని అని బీజేపీతో పాటు మిత్రులు మద్దతుదారులు అంటున్నారు. ఇక 2025 చెప్పాలీ అంటే మోడీ నామ సంవత్సరంగా సాగింది. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధించింది. బీహార్ తో బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు తిరుగులేదని చాటింది. దాంతో మోడీ నాయకత్వం మీద ప్రజలకు మరింత నమ్మకం గురి కుదిరిన ఏడాదిగా 2025 ని అంతా చెప్పుకుంటున్నారు. ఇక 2026 లో అదే హవాను నరేంద్ర మోడీ చూపిస్తారా ఆయన జాతకం ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉత్సుకతగా ఉంటుంది కదా.

మోడీ స్పీడ్ ఆగదు :

మోడీ జోరు 2026లోనూ అలాగే కొనసాగుతుందని జ్యోతీష్యులు చెబుతున్నారు. ఆయన మహా రాజయోగానికి తిరుగులేదని చెబుతున్నారు. మోడీ మార్క్ అప్రతిహత విజయాలు అలాగే నమోదు అవుతూంటాయని అంటున్నారు. ఇక చూస్తే ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఈ స్టేట్ ని కైవశం చేసుకోవాలని బీజేపీ 2021లోనే భారీ స్కెచ్ గీసింది కానీ బలమైన ప్రతిపక్షం అయింది. అయిదేళ్ళ తరువాత బీజేపీ కోరిక ఈ ఏడాది తీరుతుందని విశ్వాసంతో ఉంది. మోడీ జాతకం కూడా తిరుగులేదని చెబుతున్న వేళ అందరి ఫోకస్ బెంగాల్ రిజల్ట్ మీద ఉంది.

సైకిల్ కి నో బ్రేక్స్ :

మోడీ తర్వాత వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీనే. ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాలుగవ సారి సీఎం గా ఉన్నారు. ఆయన పాలనలో కూటమి ప్రభుత్వం గత ఏడాదిన్నరగా సాగుతోంది. 2025 లో ఒక విధంగా బాబు పాలనలో స్పీడ్ పెంచేశారు. అభివృద్ధిని తనదైన మార్క్ లో చూపిస్తూనే సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఇదే దూకుడుతో 2026 లోనూ కొనసాగుతామని టీడీపీ ధీమాగా ఉంది. బాబు జాతకం చూస్తే ఆయన సారధ్యంలో సైకిల్ కి బ్రేకులు ఉండవని స్పీడ్ గా దూసుకుని పోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరింత ప్రతిభావంతంగా బాబు నడిపిస్తారు అని అంటున్నారు. ఈ ఏడాది బాబు ప్రభుత్వానికి మంచి అంతా జరుగుతుందని ఇబ్బందులు ఏ వైపు నుంచి కూడా ఉండే చాన్స్ లేదని అంటున్నారు. మరి లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఇదే ఏడాది ఉన్నాయి. 2024 ఎన్నికల్లో చూపించిన మార్క్ ని బంపర్ విక్టరీని కంటిన్యూ చేయాలని కూటమి పెద్దలు చూస్తున్నారు. ఆ ఫలితాల విషయంలో అయితే ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

పవన్ మహర్జాతకుడు :

ఇక ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం 2026లో మరింతగా మేలు చేసేదిగా ఉండబోతుంది అని అంతా చెబుతున్నారు. ఆయనది మకర రాశి. ఈ ఏడాది మకర రాశికి అంతా సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెబుతున్నారు. దాంతో పాలనాపరంగానే కాదు రాజకీయంగానూ పవన్ జోరు ఎక్కడా ఆగదని తగ్గేదే లేదని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తాను చాటాలని సైనికులు అంతా ఎదురుచూస్తున్న వేళ సేనాని అద్భుతమైన జాతకం వారికి ఎంతో సంతోషాన్న్ని తెచ్చిపెడుతోంది.

జగన్ ఇమేజ్ తో :

ఇక 2025లో పెద్దగా ఎక్కడా కనిపించని జగన్ 2026 లో ఏమి చేయబోతున్నారు అన్నది ఒక చర్చ. అయితే జగన్ ఇమేజ్ కి ఏమీ ఇబ్బంది ఉండదని ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారని అలా జనాకర్షణ శక్తి ఆయనకు కొన్సాగుతుందని అంటున్నారు. మరి వైసీపీకి 2024 ఎన్నికల్లో చావు దెబ్బ తగింది. 2026లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా ఏమైనా కోలుకుంటుందా జగన్ ప్రజాకర్షణ శక్తి కేవలం ఆయనతోనే ఆగిపోతుందా అది పార్టీ విజయానికి కూడా దోహదపడుతుందా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఏపీలో ముగ్గురు కీలక నేతల జాతకాలు బాగానే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News