• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా అంటే ఏపీకి భయం...

కరోనా అంటే ఏపీకి భయం లేదా..!

By - Tupaki Desk
Update: 2020-03-18 09:55 GMT
కరోనా.. ఈ పేరు వింటేనే దేశంలోని రాష్ట్రాలన్నీ వణికి చస్తున్నాయి. కరోనా వైరస్ కి భయపడే దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లను మూసివేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణాలో అయితే ఈ నెల 31వరకు సినిమా థియేటర్లు - స్కూల్స్ - మాల్స్ మూసేయాలని హుకుం జారీచేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు మూతపడి మూడు రోజులవుతుంది. జనాలు కూడా పెద్దగా బయట తిరగడం మానేశారు. కానీ అన్ని రాష్ట్రాలు కరోనా నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని కంగారు పడుతుంటే..

ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మా రాష్ట్రంలో కరోనా ఉనికి లేదంటూ చెప్పడం తో దేశం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది అంటే నమ్మక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కరోనా లేదు ఏం లేదు భయపడకండి అంటుంది. ఏపీ లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదవడం తో రాష్ట్ర ప్రభుత్వం చీకుచింతా లేకుండా ఉన్నట్లు అన్పిస్తుంది. అందుకే ఏపీలో ఇంతవరకు సినిమా థియేటర్లను, స్కూళ్లను మూయించలేదు. అయితే ఒకే ఒక్క కేసు నమోదైన నెల్లూరు జిల్లాలో మాత్రం సినిమా హాళ్లను మూసివేయాలని కలెక్టర్ ఆర్డర్ చేసారు.

అదేవిధంగా తాజాగా రాష్ట్రంలోని సినిమా హాళ్ళన్నీ స్వచ్చందంగా మూసివేయాలని గోదావరి జిల్లా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినట్లు సమాచారం. రేపటి నుండి ఏపీ లో కూడా మార్చి 31వరకు సినిమా హాళ్లు మూతపడనున్నాయి. ప్రస్తుతం సినిమాలకు ఆదరణ లేక కొత్త సినిమాలు విడుదల గాక ఖాళీగా ఉంచడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అసోసియేషన్ తెలిపింది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించక పోవడం తో రాష్ట్ర ప్రజలు - ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచనలో పడ్డాయి.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Latest News 
  • Tupaki News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • covid 19 
  • AP govt 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS