• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ రాజధానిపై కేంద్రం...

ఏపీ రాజధానిపై కేంద్రం ఎందుకలా చేస్తోంది ?

By - Tupaki Desk
Update: 2021-07-08 11:37 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ అని చెప్పాలా? లేక అమరావతి అని చెప్పాలా ? లేక జగన్ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తీసుకొచ్చినట్టు మూడు రాజధానులు అని చెప్పాలా? అని చాలామంది తికమక పడుతున్నారు. అయితే , దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతున్న కొన్ని పరిణామాలని క్షుణ్ణంగా పరిశీలిస్తే జగన్ ప్రభుత్వం చెప్పినట్టు మూడు రాజధానులకి కేంద్రం కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా కేంద్రం నుంచి రాష్ట్రాధికారులకు వస్తున్న లేఖలు, సర్క్యూలర్‌ లపై ఆంధ్రప్రదేశ్‌- హైదరాబాద్‌ అని ఉంటోంది. పాత అలవాటు ప్రకారం అలా పెట్టి ఉంటారని రాష్ట్ర అధికారులు భావిస్తూ వచ్చారు.

కానీ, ఇప్పుడు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు పరిశీలిస్తే ఏపీకి మూడు రాజధానులున్నాయని కేంద్రం సైతం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారంపై ఒకవైపు హైకోర్టులో కేసులు గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో  కేంద్ర ప్రభుత్వమే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజధాని ఏది, ఏపీలో పేదలకోసం ఎన్ని ఇళ్లు కట్టారు, రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఎంత మంజూరు చేశారు ఏపీలో స్మార్ట్‌సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా? అంటూ హైదరాబాద్‌కు చెందిన చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్రం దాదాపుగా ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయి అన్నట్టుగానే సమాధానం ఇచ్చింది.

ఇదే ప్రశ్న గతంలో అడిగినప్పుడు ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానం ఇచ్చింది.అయితే తానేమీ దేశ రక్షణ రహస్యాలు అడగడం లేదని, రాష్ట్ర రాజధాని ఏదో తెలుసుకోవాలనుకుంటున్నానని తనకు సమాధానం ఇవ్వకపోతే కోర్టుకు వెళతానని చైతన్యకుమార్‌రెడ్డి స్పష్టం చేయడంతో కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనకు సమాధానం పంపించింది. అందులో ఒకటి నుంచి ఐదువరకు ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ రాజధాని ఏది మొదలుకొని, మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అన్న ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ- అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది, ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చింది. ఇక్కడే కేంద్ర వైఖరిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇప్పుడు ఏది ఉందో అదే చెప్పాలి. మూడు రాజధానులను కేంద్రం అంగీకరించిందా అన్న ప్రశ్నకు వారికి ఇష్టమైన సమాధానం చెప్పవచ్చు. కానీ కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో అమరావతి అన్న పదం ఎక్కడా లేదు. అంటే ప్రస్తుత రాజధానిగా అమరావతిని గుర్తించనట్లే కనిపిస్తోంది. అధికారికంగా హైదరాబాద్ ను చూపిస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తే ..కేంద్రం కూడా మూడు రాజధానుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.  మూడు రాజధానులను కేంద్రం గుర్తించగానే ..కర్నూలుకు హైకోర్టు తరలింపు కోసం తొందరలోనే రీ నోటిఫికేషన్ రావటం ఖాయమని స్పష్టం అవుతోంది. హైకోర్టు తరలింపుకు కేంద్రం రీ నోటిఫికేషన్ జారీ చేయటం కోసమే సీఎం జగన్ ఎదురుచూస్తున్నారు. కేంద్రంఆపని చేసిన వెంటనే పరిపాలనా రాజధాని వైజాగ్ కు తరలించడం క్షణాల్లో జరిగిపోతుంది.ఆ తర్వాత  అమరావతి శాసనరాజధానిగా మాత్రమే కొనసాగుతుంది.  గతంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని అప్పట్లోనే కేంద్ర న్యాయశాఖ చాలా స్పష్టంగా ఒకటికి మూడుసార్లు అఫిడవిట్లు ఇచ్చింది. అయితే , ప్రస్తుతం కేంద్రం వ్యవహారశైలిని పరిశీలిస్తే మూడు రాజధానుల ప్రకటన చాలా త్వరగానే వెలువడే అవకాశం లేకపోలేదు.
Tags:    
  • 3 capitals 
  • Amaravathi 
  • Andhrapradesh 
  • Latest News 
  • Telugu News 

Similar News

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS