• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంచి కాలం మించిపోతోంది......

మంచి కాలం మించిపోతోంది... బస్సు యాత్ర ఎపుడు సేనానీ...?

By - Tupaki Desk
Update: 2022-12-05 06:30 GMT
మంచి తరుణం మించిపోతోంది. కాలం ఆగని ప్రవాహం. అది అలా సాగిపోతూనే ఉంటుంది. రాజకీయాలు చేసేవారికి నాయకులకు కాలం  ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ అది పరుగులు తీస్తుంది. దాంతోనే వారు కూడా పరుగులు పెట్టాల్సి ఉంటుంది. ఆ పనిని ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు చేస్తున్నారు. ఇక ఆయన తనయుడు నారా లోకేష్ సైతం పాదయాత్ర అంటున్నారు. మరి పవన్ ఎక్కడ. ఆయన బస్సు యాత్ర డేట్ ఎపుడు. ఇదే ఏపీలో రాజకీయాల పట్ల ఆసక్తిని చూపిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రశ్న.

నిజానికి ఏపీలో ఎన్నికలకు టైం చాలా తక్కువ ఉంది. కచ్చితంగా ఏణ్ణర్ధం కంటే ఎక్కువ టైం లేదు. ఇక జగన్ కనుక ముందస్తు ఎన్నికలు అని డిసైడ్ అయితే ఆ ఎన్నికలు కాస్తా చాలా ముందుకు తోసుకువస్తాయి. ఈ నేపధ్యంలో ఎన్నికలలో గట్టిగా తేల్చుకోవాలంటే ఎవరైనా జనంలో ఉండాలి. మరి ఏపీలో వచ్చేది మేమే రాబోయే కాలానికి కాబోయే సీఎం మా పవనే అని చెబుతున్న జనసేన ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్నదే పెద్ద చర్చగా ఉంది.

పవన్ కళ్యాణ్ తనకు వీలు వెంబడి మాత్రమే ఏపీకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. దానిని అధికార వైసీపీ నేతలు వీకెండ్ పాలిటిక్స్ అని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నందువల్ల డోస్ ఏ మాత్రం సరిపోదు పవన్ నిత్యం జనాలలో ఉంటేనే తప్ప కధ రక్తి కట్టదు అని అంటున్నారు. ఒక వైపు జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలెడుతున్నారు. ఎన్నికలు వచ్చేంతవరకూ ఆ పాదయాత్ర సాగుతుంది అని అంటున్నారు.

అలాగే చంద్రబాబు జిల్లాల టూర్లు చేస్తున్నారు. ఆయన కూడా వారంలో మూడు నాలుగు రోజులు జిల్లాలోనే ఉంటున్నారు. మరి విపక్షంలో కీలక పక్షంగా ఉన్న జనసేన కూడా ఆ దిశగా యాక్టివిటీ స్టార్ట్ చేయాలి కదా అన్నదే అందరి మాటగా ఉంది అప్పట్లో అంటే జగన్ విపక్షంలో ఉన్నపుడు రెండేళ్లకు ముందే జనంలో పదయాత్ర కోసం వచ్చేశారు. అది ఆయన పార్టీ విజయానికి కలసివచ్చింది.

ఇపుడు చూస్తే గట్టిగా ఏణ్ణర్ధం కూడా లేదు. ఈ టైం ని సద్వినియోగం చేసుకోవడానికి పవన్ జనంలోకి రావాలని అంటున్నారు. అయితే పవన్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా తరువాత సుజీత్, హరీష్ శంకర్ లతో మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తి అయ్యేసరికి ఎన్నికలు వచ్చేస్తాయా అన్న డౌట్ కొడుతోందిట.

మరి ఏపీలో ఎన్నికలు అత్యంత కీలకం అని చెబుతున్న జనసేనకు పవన్ లాంటి వారు రంగంలోకి దిగకపోతే ఎలా అన్న ప్రశ్న వస్తోంది. బస్సు యాత్ర పవన్ దసరా నుంచే స్టార్ట్ చేస్తారు అని ప్రకటన కొన్నాళ్ళ క్రితం వచ్చింది. అయితే అది కాస్తా పోస్ట్ పోన్ అయింది. ఇపుడు చూస్తే కొత్త ఏడాది వస్తోంది కానీ బస్సు యాత్ర గురించి అప్డేట్స్ లేవు.

మరి బస్సు యాత్ర ఉంటుందా ఉంటే ఎపుడు అన్నది చర్చకు వస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతఒంది కానీ నిజంగా ఆ డేట్ ముహూర్తం ఎపుడో జనసేన వారే చెప్పాలి అని అంటున్నారు. ఇంతకంటే మంచి సమయం రాదు, కాబట్టి పవన్ జనంలో ఉండాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి జనసేన నుంచి బస్సు యాత్ర మీద ఏ రకమైన ప్రకటన వస్తుందో.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • APAssemblyElections 
  • JanasenaChief 
  • PawanKalyan 
  • YSRCPGovernment 
  • YSJaganMohanReddy 
  • TDPParty 
  • APPolitics 
  • Chandrababu 
  • LokeshPadayatra 
  • JaganBusYatra 

Similar News

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

Copyright @2026

Powered by Blink CMS