డేట్ కి వెళ్ళా.. అమ్మాయి అందంగా లేదు చూడగానే పారిపోయా : కోహ్లీ

Update: 2021-05-20 04:39 GMT
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి  యూత్ లో ఉన్న  ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల్లోనూ  అతనికి ఎంతో క్రేజ్ ఉంది. క్రికెట్ లోకి వచ్చిన కొత్తలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కతో కోహ్లీ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్ల లవ్ తర్వాత వివాహం చేసుకున్నాడు. అయితే కోహ్లీ అనుష్క పరిచయం కాకముందే, క్రికెట్ ఆడుతున్న  తొలినాళ్లలో ఓ అమ్మాయితో డేట్ కి వెళ్ళాడట. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆ విషయాలు పంచుకున్నాడు.

అయితే డేట్ కి వెళ్లిన కోహ్లీ ఐదే ఐదు  నిమిషాల్లో ఆ అమ్మాయి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడట. కోహ్లీ ఇందుకు సంబంధించిన అనుభవాలు వివరిస్తున్న వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంటీవీ వీజే అనూశ దండేకర్‌ ఓ ప్రైవేట్  పార్టీలో యంగ్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసింది. విరాట్ ను పలు ప్రశ్నలు అడిగింది.

ఈ సందర్భంగా వీజే  'మీ జీవితంలో త్వరగా ముగిసిన భోజనం, స్నానం, డేట్‌' గురించి చెప్పాలని ప్రశ్నించింది. ' దీనిపై కోహ్లీ మాట్లాడుతూ ఓ అమ్మాయి కి సంబంధించి ఏ వివరాలు తెలియకుండానే ఆమె కోసం  డేట్ కి వెళ్ళానని, కానీ అక్కడ ఆ అమ్మాయిని చూడగానే అందంగా లేకపోవడంతో ఐదు నిమిషాల్లోనే అక్కడ్నుంచి తిరిగి వచ్చేశాను. తన గురించి తెలియకుండానే బ్లైండ్ గా డేట్ కి వెళ్లాను. చూడగానే ఏమంత అందంగా అనిపించలేదు. అంతే అక్కడి నుంచి పారిపోయాను. కేవలం 5 నిమిషాల్లో డేట్ ముగిసింది.' అని కోహ్లీ ఆ వీడియోలో వివరించాడు.

ఇంకా బాలీవుడ్ హీరోయిన్లకు  సంబంధించిన విషయాల గురించి కూడా కోహ్లీ మాట్లాడాడు. అయితే ఆ వీడియోలో అనుష్క గురించి మాట్లాడలేదు. మీరు ఏ బాలీవుడ్ హీరోయిన్ క్రికెట్ ఆడితే చూడాలని అనుకుంటున్నారని వీజే ప్రశ్నించగా ' జెనీలియా క్రికెట్ ఆడితే చూడాలని ఉంది ' అని కోహ్లీ సమాధానమిచ్చాడు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి కోహ్లీ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Full View
Tags:    

Similar News