• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిట్టీ అంటూ లోకేశ్ ను...

చిట్టీ అంటూ లోకేశ్ ను ఆటాడేసుకుంటున్న విజయసాయిరెడ్డి

By - Tupaki Desk
Update: 2020-02-21 07:15 GMT
అకస్మాత్తుగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మీడియా ముందుకు వచ్చి ఇవి నారా కుటుంబ ఆస్తులు అంటూ కొన్ని పేపర్లు పట్టుకుని చదివేసి వెళ్లిపోయాడు. ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా ఆస్తులను ప్రకటిస్తున్నట్లు చెప్పి అదెదో గొప్ప పని చేసినట్టు గర్వంతో వెళ్లారు. అయితే ఈ నారా వారి ఆస్తుల వివరాలు తప్పుల తడక, మార్పులుచేర్పలు అవి ఎవరికీ అర్థం కావు.. ఎవరడిగారని ప్రకటిస్తారో తెలియదు. కానీ మీడియా ముందుకు వచ్చి అదో ఒక గొప్ప పనిగా భావించి ఆర్భాటంగా ప్రకటిస్తారు. తాజాగా ఈ ఆస్తుల ప్రకటన పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు, లోకేశ్ ను ఆటాడేసుకున్నారు. ట్విటర్ లో దీనిపై పలు ట్వీట్లు చేస్తూ నారా కుటుంబం ఆస్తులపై సెటైర్లు పేల్చారు.

'' తండ్రేమో తన ఆస్తి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టి నాయుడేమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పటి దాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!'' అంటూ మొదట ట్వీట్ చేయగా.. అనంతరం కొద్ది సేపటికి మరో ట్వీట్ చేశారు.

''అహ్మద్ పటేల్‌ కు పంపిన రూ.400 కోట్లే కాదు.. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చారన్నారు విజయసాయి. తెలంగాణా ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టారని.. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగిందని.. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశారు'' అంటూ చంద్రబాబు అవినీతి అక్రమాలు చేశారని ఆరోపిస్తూ ట్వీట్లు చేశారు.

నారా కుటుంబం ప్రకటించిన ఆస్తులు రోటీన్ డ్రామానే... వారు ప్రకటించనవి, బినామీ ఆస్తులు, సీక్రెట్ బ్యాంక్ అకౌంట్స్‌ వివరాలు మాత్రం ప్రకటించరన్నారు. చంద్రబాబు బినామీ ఆస్తులపై, ఆక్రమించిన భూములు, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. స్విస్ బ్యాంక్ అకౌంట్లు, బినామీలపై విచారణ కు రెడీనా అంటూ చంద్రబాబు, లోకేశ్ కు ట్వీటర్ లో సవాల్ విసిరారు. ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్ తీరుపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ వారికి చురకలు అంటిస్తున్నారు. చిట్టీ అంటూ లోకేశ్ ను వ్యంగ్యం పలుకుతూ హాస్యం పండిస్తున్నారు.
Tags:    
  • Vijaya Sai Reddy Fires On Chandra Babu 
  • Cbn 
  • Telugu Desam 
  • Telugu Desam News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS