• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు ముఖ్య సలహాదారుడు...

బాబు ముఖ్య సలహాదారుడు చిట్టి నాయుడే !

By - Tupaki Desk
Update: 2020-01-11 10:08 GMT
ఏపీలో మూడు రాజధానుల రగడ తారాస్థాయికి చేరింది. ఏపీ రాజధాని అమరావతినే కొనసాగించాలని అటు రాజధాని రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యం గా టీడీపీ ఏపీ రాజధాని అమరావతినే అని కొంచెం గట్టిగా అమరావతి ప్రాంత రైతులకి మద్దతునిస్తుంది. ఇక ఇదే క్రమంలో జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా సమయంలో ఏపీలో టీడీపీ ఆందోళనలు ఉధృతం చేసింది . వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులకు బాసటగా పోరాటం సాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తం గా పర్యటిస్తున్నారు. చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తనదైన రీతిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్న తీరుపై విజయసాయి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. మొన్నటికి మొన్న గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి విరాళాలు అడగటం దేనికని , దీనికి చంద్రబాబు నాయుడు ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా అని వెటకారంగా మాట్లాడారు. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా ‘రాజు గారి దేవతా వస్త్రాల' కథ గుర్తు కొస్తోంది. తుఫాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ? అంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

అంతేకాదు మరో ట్వీట్ లో చంద్రబాబు నాయుడు స్వభావం మొదటి నుంచి అంతే అంటూ విమర్శలు గుప్పించారు . ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు అని విజయసాయి పేర్కొన్నారు . అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు అంటూ మండిపడ్డారు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి అంటూ విజయసాయి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
Tags:    
  • Vijaya Sai Reddy Fires On Chandra Babu 
  • Cbn 
  • Telugu Desam 
  • Telugu Desam News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS