• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతి లో పెప్పర్...

అమరావతి లో పెప్పర్ గ్యాంగ్ దించిన బాబు

By - Tupaki Desk
Update: 2020-02-25 10:12 GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు. వరుస ట్వీట్లతో బెంబేలెత్తించారు. తాజాగా టీడీపీ నేతలను పెయిడ్ ఆర్టిస్టులు అని.. కళ్లల్లో కారం గొట్టే పెప్పర్ గ్యాంగ్ లు అంటూ ఆడిపోసుకున్నారు.

రాజధాని తరలించ వద్దని చంద్రబాబు పిలుపునిస్తే ఎవరూ పట్టించుకోలేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’లను వీధుల్లోకి దించారని దుయ్య బట్టారు. వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులని విమర్శించారు. వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ పై దాడి చేసిన మహిళలు టీడీపీ పెప్పర్ గ్యాంగ్ అని.. కళ్లలో కారం చల్లారని మండి పడ్డారు.

అమరావతికి సంబంధం లేని మహిళలను తీసుకొచ్చి 40 ఇయర్స్ బాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. దాడులు చేయిస్తూ దుష్ప్రచారాలు చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలు ఓడించినప్పటి నుంచి రాష్ట్రం లో విధ్వంస రాజకీయం చేస్తున్నాడని విమర్శించాడు. ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు.

చంద్రబాబు దోపిడీ బయటపెడితే కులం, కక్ష అంటూ బట్టలు చింపుకుంటున్నాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పదవిలో ఉన్నన్నీనాళ్లు కమీషన్లు, వాటాల కోసమే కక్కుర్తి పడ్డాడని.. ఎల్లో మీడియా బాబుకు డప్పు కొడుతూ బయట పడకుండా చూసేదని విమర్శించారు.
Tags:    
  • Vijaya Sai Reddy Fires On Chandra Babu 
  • Cbn 
  • Telugu Desam 
  • Telugu Desam News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS