పేట నా కోట.. ఎవ్వరికీ స్థానం లేదంటున్న రజినీ?

Update: 2020-07-07 04:30 GMT
చిలకలూరిపేటను తనకు పెట్టని కోటగా తీర్చిదిద్దుకోవాలని వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే విడుదల రజినీ నియోజకవర్గంలో ఎత్తులు వేస్తున్నారట.. తన ప్రత్యర్థులకు అవకాశాలు దక్కకుండా ఎదగకుండా బాగానే ప్లాన్లు చేస్తోందని నియోజకవర్గంలో కోడై కూస్తున్నారు. అయితే ప్రత్యర్థి ఏం తక్కువ వాడు కాదు.. 2004లోనే వైఎస్ఆర్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆర్థికంగా లేక మొన్న 2019 ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయాడు. అయినా ఇప్పుడు వైసీపీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే రజినీకి చుక్కలు చూపిస్తున్నాడు. అతడే వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్. చిలకూరిపేటలో ఈ ఆసక్తికరపోరు ఇప్పుడు వైసీపీలో కాకరేపుతోంది.

పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్ని విధాలుగా వైసీపీకి అండగా ఉన్నారు మర్రి రాజశేఖర్. మొన్నటి 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆయనకే అనుకున్నారు. కానీ ఆర్థిక బలం లేక సడన్ గా తెరమీదకు వచ్చి విడుదల రజినీ టికెట్ ను ఎగరేసుకుపోయారు. వైఎస్ జగన్ గాలిలో గెలిచేశారు. దీంతో అప్పటి నుంచి మర్రి వర్సెస్ రజినీ రాజకీయం చిలకలూరిపేటలో సెగలు కక్కుతోంది.

సీనియర్లతో నిత్యం టచ్ లో ఉండే మర్రికే అధిష్టానం నుంచి సమాచారం వస్తోందట.. రజినీ కొత్త ఎమ్మెల్యే కావడంతో అధిష్టానం పెద్దల దగ్గర పరపతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మర్రిని ఎలాగైనా అణిచేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎగరేసుకుపోతాడని.. అతడిని తగ్గించే ప్రయత్నాలను రజినీ చేస్తున్నారని ఆ నియోజకవర్గంలో టాక్.

ఈ క్రమంలోనే ఇటీవల మర్రి బర్త్ డేకు పెద్ద ఎత్తున చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు ఊడబీకించడం మర్రి వర్గానికి ఆగ్రహం తెప్పించింది. దీని వెనుక ఎమ్మెల్యే రజిని గారి హస్తం ఉంది అని మర్రి సపోర్టర్లు ఆరోపణ .  మున్సిపల్ ముందు మర్రి వర్గం ఆందోళనకు దిగింది. ఈ విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లిందట.. దీంతో మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఆయన వర్గం అంటున్నారు. ఇక ఈ కోవలోనే మంత్రి పదవికి పోటీ వస్తాడని రజినీ ఆందోళనగా ఉందట.. దీంతో వీరిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్ నియోజకవర్గంలో సెగలు కక్కుతోంది.
Tags:    

Similar News