బందరు ఎంపీగా వంగవీటి రాధా

Update: 2019-03-14 08:19 GMT
అసమ్మతి నేతల్ని బుజ్జగించడం - ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు నియోజకవర్గాలు కేటాయించడం.. గత రెండు రోజులుగా చంద్రబాబు పరిస్థితి ఇలాగే ఉంది.  అసమ్మతి ఉన్నచోట.. సిట్టింగ్‌ లకు అవకాశం ఇవ్వడం లేదు. ఓడిపోయే ఒక్క అవకాశాన్ని కూడా చంద్రబాబు తీసుకోవడం లేదు. అందుకే.. అసమ్మతికి కాదనలేక - నాయకుల్ని వదులుకోలేక.. నియోజకవర్గాల్ని మారుస్తున్నారు.

నిన్నటికి నిన్న వంగవీటి రంగా తనయుడు - మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పుసుపు టీడీపీలో చేరారు. దీంతో ఇప్పుడు రాధాకి కూడా సీటు ఇవ్వక తప్పని పరిస్థితి. అందుకే రాధాకి ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీగా పంపించాలని అనుకుంటున్నారు చంద్రబాబు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాధాని మచిలీపట్నం ఎంపీగా బరిలోగి దింపాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆల్‌ రెడీ బందరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నా కొనకళ్లకు పెడన నియోజకవర్గం అప్పగించారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

ఇక కొవ్వూరులో మంత్రి జవహర్‌ కు అసమ్మతి సెగ బాగా తగిలింది. దీంతో.. ఆయనకు సీటు ఇస్తే గెలవడం కష్టం అని భావించిన చంద్రబాబు.. జవహర్‌ ని కొవ్వూరు నుంచి తిరువూరుకి షిఫ్ట్‌ చేశారు. పార్టీ నిర్వహించిన సర్వేల్లో జవహర్‌ కు సానుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో జవహర్‌ అభ్యర్థిత్వంపై చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. ఇక కొవ్వూరు నియోజకవర్గం నుంచి అనిత  పోటీ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి తన అభ్యర్థులకు నియోజకవర్గాలు మారుస్తూ ఫుల్‌ బిజీలో ఉన్నారు చంద్రబాబు.
    

Tags:    

Similar News