సైరా నరసింహారెడ్డి.. సొంతిల్లు ఇప్పుడు ఇలా ఉంది!

Update: 2019-09-16 07:30 GMT
రేనాటి సూర్యుడు.. విప్లవ సింహం..భారత స్వతంత్ర తొలి పోరాటకారుడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి! ఆంగ్లేయులకు అప్పటికే శతాబ్దానికి పైగా బానిసల్లా బతుకుతున్న భారతీయుల నుంచి వినిపించిన తొలి సింహగర్జన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంగ్లేయులపై తిరుగుబావుట ఎగరేసిన తెలుగు తేజం నరసింహారెడ్డి.

అలాంటి విప్లవ వీరుడికి చరిత్రలో ఉన్న పేజీలు తక్కువే. ఉయ్యాలవాడ విప్లవ గర్జన ఆంగ్లేయులకు వినిపించినంత గట్టిగా.. భారతీయులకు వినిపించలేదు. 'సైరా.. నరసింహారెడ్డి' వంటి భారీ సినిమా వస్తూ ఉండటంతో.. ఉయ్యాలవాడ కథకు ఇప్పుడు ప్రాచూర్యం లభిస్తూ ఉంది. అయితే రాయలసీమ వాసులకు సుపరిచితుడు ఈ విప్లవవీరుడు. రేనాటి సూర్యుడిగా ఈయనను ఆరాధిస్తారు.

రేనాటి గడ్డపై ఆయన చరిత్రకు బోలెడన్ని సాక్ష్యాలున్నాయి.  శతాబ్దాలు గడుస్తున్నా.. ఆ పరిసరాలు నరసింహారెడ్డి విప్లవగర్జనను వినిపిస్తూనే ఉన్నాయి. అలా రేనాటి సూర్యుడి తన వెలుగును కాంచి, దేశానికే స్వతంత్ర స్ఫూర్తిని నింపిన ప్రాంతాలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇల్లు అనేక భాగాలుగా విడిపోయి ప్రస్తుతం పాక్షికంగా కొంత మిగిలి ఉంది. అందులో కూడా అద్భుత నిర్మాణ నైపుణ్యం కనిపిస్తుంది. అలాగే ఉయ్యాలవాడ ధ్వజమెత్తిన కోవెలకుంట్ల ట్రెజరీ ప్రస్తుత స్థితి, ఆయనను బ్రిటీషర్లు పట్టుకున్న జగన్నాథుడి  కొండను, ఆయనను ఉరి తీసిన జుర్రేరు తీరాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.


Full View

Tags:    

Similar News