కంప్లైంట్ తీసుకోవాలంటే.. తన ముందు డ్యాన్స్ చేయాలన్న సీఐ?

Update: 2020-08-17 03:45 GMT
చిత్ర.. విచిత్రమైన ఉదంతాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఉత్తరప్రదేశ్. తాజాగా ఆ రాష్ట్రంలో ఒక సీఐ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కంప్లైంట్ చేసేందుకు వెళ్లిన టీనేజర్ తో సదరు స్టేషన్ ఇన్ స్పెక్టర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. యూపీ పోలీసులకు కొత్త చిక్కును తెచ్చి పెట్టింది. ఇంతకీ ఈ వివాదం ఏమిటన్నది చూస్తే..

యూపీలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ కు పదహారేళ్ల బాలిక వచ్చింది. తాము ఉంటున్న అద్దె ఇంటి యజమాని మేనల్లుడు తమతో దారుణంగా వ్యవహరిస్తున్నారని.. అతడి తీరుపై కంప్లైంట్ చేసేందుకు తాను స్టేషన్ కు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఫిర్యాదు చేయటానికి వచ్చిన తన పట్ల స్టేషన్ సీఐ దారుణంగా వ్యవహరించినట్లుగా ఆ టీనేజ్ బాలిక సంచలన ఆరోపణలు చేసింది. తాను ఫిర్యాదు చేయటానికి వెళితే.. తన ముందు డ్యాన్స్ చేయాలని.. అప్పుడు మాత్రమే కంప్లైంట్ తీసుకుంటానని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ పేర్కొన్నట్లుగా ఆమె ఆరోపించింది.

సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్యాన్స్ చేస్తేనే కంప్లైంట్ తీసుకుంటానని సీఐ కండీషన్ పెట్టారని.. దీంతో తాను షాక్ కు గురైనట్లుగా ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. బాలిక కుటుంబానికి వారు ఉండే ఇంటి యజమాని కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో తమను కలుగజేసుకోవాలని కోరారని.. తాము నిరాకరించటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకే ఆ బాలిన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తాజా ఉదంతంలో బాలిక వాదనకు సోషల్ మీడియా సానుకూలంగా స్పందించటంతో.. యూపీ పోలీసులకు ఇప్పుడీ ఎపిసోడ్ ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News